జాతీయ

Arvind Kejriwal: ప్రచారంలో భాగంగా మహిళ కాళ్లు మొక్కిన కేజ్రీవాల్..

Arvind Kejriwal: పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నార్త్ గోవాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Arvind Kejriwal (tv5news.in)
X

Arvind Kejriwal (tv5news.in)

Arvind Kejriwal: త్వరలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ దూకుడు పెంచింది. పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నార్త్ గోవాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆప్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌కు స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభించింది.

సెయింట్ ఆండ్రూ గ్రామంలో మహిళ కాళ్లను కేజ్రీవాల్ మొక్కగా.. సదరు మహిళా కుటుంబం ఢిల్లీ సీఎంకు పూల మొక్కను అందించారు. గోవా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టడం ఖాయమని కేజ్రీవాల్ అన్నారు. ఈసారి గోవా ఎన్నికల్లో ఆప్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES