వరద గుప్పిట్లో అస్సోమ్- మరో 2 రోజుల పాటు వర్షాలు

వరద గుప్పిట్లో అస్సోమ్- మరో 2 రోజుల పాటు వర్షాలు
10 జిల్లాల్లో వరద భీభత్సం

దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దేశంలో ఒక రాష్ట్రంలోని వాతావరణం ఒక్కొక్కలా ఉండి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఎండలు మండిపోయి, ఎంతోమంది జనం వడగాడ్పులతో ప్రాణాలు కోల్పోతుండగా, ఇంకొన్ని రాష్ట్రాల్లో వరదలకు జనం నీళ్లపాలు అవుతున్నారు.

ఈశాన్య రాష్ట్రం అసోం గత కొన్నిరోజులుగా కుంభవృష్టితో కొట్టుకుపోతోంది. జనజీవనం అస్తవ్యస్తం అయింది. సుమారు 10 జిల్లాల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. కొన్ని పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, శిథిలావస్థలో వున్న ఇళ్లను అధికారులు ముందుగానే కూల్చివేస్తున్నారు. దాదాపు 30 వేల మందికిపైగా వ‌ర‌ద‌ల్లో చిక్కుకుకుపోవడంతో రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం హిమంత బిశ్వ శర్మ సమీక్ష చేపట్టారు. స్వయంగా కంట్రోల్ రూం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతుందని, ప్రజలకు తాము అండగా ఉంటామని సీఎం ధైర్యం చెప్పారు. రాష్ట్రానికి రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. మ‌రికొన్ని రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి.

Assam floods | 31,000 people affected in 10 districtsల‌ఖింపూర్ అనే జిల్లాలో సుమారు 22 వేల మంది వ‌ర‌ద నీటిలోనే ఉన్నారు. ఏడుజిల్లాల్లో 25 రిలీఫ్ డిస్ట్రిబూష‌న్ సెంట‌ర్ల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. కొన్ని ప్ర‌దేశాల్లో కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జోర్హాట్ జిల్లాలో ఉన్న నిమ్తి ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. అనేక రోడ్లు, వంతెనలు, పాఠశాలలు వరదల్లో మునిగిపోయాయి. బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. కాగా భారతదేశంలో ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రాల్లో అస్సాం ఒకటి. ఈ రాష్ట్రానికి వరద సమస్య ప్రతి సంవత్సరం వచ్చే ఓ వార్షిక విపత్తుగా మారింది. అత్యధిక జనాభా కలిగిన ఈ ఈశాన్య రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతారు. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. కోట్లాది రూపాయల ఖరీదైన పంటలకు తీవ్ర నష్టం వస్తుంది. ఇక ఆస్తి నష్టానికి కూడా కొదువ ఉండదు.

Tags

Read MoreRead Less
Next Story