PM Modi : పుట్టినరోజు సందర్భంగా.. సూరత్ ఆటో డ్రైవర్ల వినూత్న నిర్ణయం

PM Modi :  పుట్టినరోజు సందర్భంగా.. సూరత్  ఆటో డ్రైవర్ల వినూత్న నిర్ణయం
73వ పుట్టిన రోజు సందర్భంగా 73 ఆటోల్లో 100 శాతం డిస్కౌంట్

ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ లోని సూరత్ పట్ణణ ఆటో డ్రైవర్లు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సుమారు వేయి మంది ఆటో డ్రైవర్లు వినియోగదారుల ఆటో ఛార్జీల్లో కొంత మేర తగ్గింపు చేయనున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆటో డ్రైవర్లను సూపర్ పశ్చిమ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ (బీజేపీ) అభినందించారు. ఆటో డ్రైవర్ల చార్జీల తగ్గింపు నిర్ణయాన్ని సైతం ఎమ్మెల్యేనే ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ 73వ జన్మదినం కావడంతో 73 మంది తమ ఆటోల్లో ఆదివారం ప్రయాణికులను ఉచితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లనున్నారు. సుమారు వేయి మంది ఆటో డ్రైవర్లు వినియోగదారుల ఆటో ఛార్జీల్లో కొంత మేర తగ్గింపు చేయనున్నారు. ఈ మేరకు గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేస్ మోదీ ఆటో రిక్షా డ్రైవర్ల ఉదారతకు కృతజ్ఞతలు తెలిపారు.

‘1,000 మంది ఆటో రిక్షా డ్రైవర్లు ప్రధాని మోదీ పుట్టిన రోజు నాడు చార్జీల్లో 30 శాతం తగ్గింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ 73వ పుట్టిన రోజు సందర్భంగా చార్జీల్లో నూరు శాతం తగ్గింపును ప్రకటించిన 73 మంది ఆటో రిక్షా డ్రైవర్లకు ధన్యవాదాలు’’అని పూర్ణేష్ మోదీ ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ బీజేపీ సేవా పఖ్వారా పేరుతో రెండు వారాల ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛత డ్రైవ్‌, ఆరోగ్య శిబిరాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం 'పీఎం విశ్వకర్మ' ను ప్రారంభించనున్నారు. కళాకారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ నైపుణ్యాలలో నిమగ్నమైన వారికి సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

పశ్చిమ బెంగాల్లో చిన్నారుల్లో మోదీలా దుస్తులు ధరించి 73వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధానికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ ఖాన్‌పూర్‌ మోదీకి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భాజపా శ్రేణులుప్రజలకు మిఠాయిలు పంచిపెట్టాయి. ఉత్తరాఖండ్‌లో మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మారథాన్‌లో సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి పాల్గొన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో.మోదీ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. దివ్యాంగులతో కలిసి క్రూయిజ్‌ రెస్టారెంట్‌లో ప్రధాని పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story