Ayodhya :చివరి దశకు రామమందిర నిర్మాణం

Ayodhya :చివరి దశకు  రామమందిర నిర్మాణం
భక్తులు సులభంగా ఆలయానికి చేరుకోవడానికి 13 కిలోమీటర్ల పొడవైన రామపథ్ నిర్మాణం

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ పనులను పూర్తి చేయాలని ట్రస్టు నిర్దేశించింది. బనారస్‌ నుంచి అర్చకులు అయోధ్యకు చేరుకున్నారని తెలిపింది.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాముని విగ్రహ ప్రతిష్టాపన తేదీని ఖరారు చేసిన క్రమంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకోగా గర్భగుడి ఫ్లోరింగ్‌ చకచకా సాగుతోంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థలానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో తలుపులు, కిటికీలను అమర్చుతున్నారు. డిసెంబర్‌ నాటికి ఈ పనులన్నీ పూర్తికానున్నాయి. ప్రస్తుతం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని స్తంభాలపై రామాయణ ఘట్టాలను వివరించే శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు.


వివిధప్రాంతాల నుంచి రాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చామని, అయితే వాటిని చెక్కేందుకు వేరేచోట్లకు తరలించామన్నారు. అవి తిరిగి వచ్చాక ప్రతిష్టిస్తామనే ఈలోపు ఇక్కడి పనులు పూర్తవుతాయని చెప్పారు. అలాగే 70 స్తంభాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. మొట్ట స్తంభాలపై శిల్పాలను చెక్కే పని జరుగుతోందాని వివరించారు.

వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 23వ తేదీల మధ్య రాముడి విగ్రహప్రతిష్టాపనకు ట్రస్టు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అతిథుల జాబితాపై ట్రస్టు దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీసహా మొత్తం 25వేల మందిని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు ట్రస్టు ఇదివరకే ప్రకటించింది. ఇప్పటికే బనారస్‌ నుంచి అర్చకులను శంకరాచార్య అయోధ్యకు పంపించారని ట్రస్టు పేర్కొంది. ఏయే పూజలు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటామని వివరించింది.


అయోధ్యలో బ్రహ్మాండమైన రామమందిరాన్ని నాగార శైలిలో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు దాదాపు 161 అడుగులు. ప్రస్తుతం ఈ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. 2.7 ఎకరాల్లో 54,700 చదరపు అడుగుల వైశాల్యంలో ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఈ మహత్కార్యాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన ఆలయ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పర్యవేక్షిస్తున్నారు.

ఆలయ నిర్మాణ పనులు అక్టోబర్ నాటికి పూర్తవుతాయి. అప్పటికి రాముడి గర్భ గుడి సిద్ధమవుతుంది. జనవరి 22న ఈ మహా మందిరంలో రాముడు కొలువై ఉంటాడు. అయోధ్యలోని ఇతర మఠాలు, ఆలయాలు రామ మందిర్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే సాధువులు, రామభక్తుల బస, ఆహారం కోసం తమ దేవాలయాలలో పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం తవ్వకాల సమయంలో పురాతన దేవాలయం, విగ్రహాలు, స్తంభాల అవశేషాలు బయటపడ్డాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గతంలో ట్విటర్‌లో (ఎక్స్‌)లో పోస్ట్ చేశారు. తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు, పురాతన నిర్మాణ అవశేషాల ఫోటోను కూడా షేర్ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story