రాజకీయరంగు పులుముకుంటున్న రెజ్లర్ల ఆందోళన

రాజకీయరంగు పులుముకుంటున్న రెజ్లర్ల ఆందోళన
సాక్షి మాలిక్, బబితా ఫొగట్ మధ్య మాటల యుద్ధం

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లందరూ కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మలుగా మారారని మాజీ రెజ్లర్ల, బీజేపీకి చెందిన బబితా ఫోగట్‌ అన్నారు. రెజ్లర్లు చేసిన పోరాటంలో బబితా ఫొగట్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారని సాక్షి మాలిక్, ఆమె భర్త సత్యవర్త్ కడియాన్ వీడియో రిలీజ్ చేయడంతో బబిత ఈ వ్యాఖలు చేశారు.బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా తాము చేస్తున్న నిరసన రాజకీయ ప్రేరేపితం కాదంటూ రెజ్లర్ సాక్షి మాలిక్, ఆమె రెజ్లర్ భర్త సత్యవర్త్ కడియాన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ రెజ్లర్, బీజేపీకి చెందిన బబితా ఫోగట్ మండిపడ్డారు. నెలల తరబడి నిరసన వ్యక్తం చేసిన రెజ్లర్లపై బబిత సుదీర్ఘంగా ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.

వివాదం ఎలా మొదలైంది అంటే

శనివారం సాక్షి మాలిక్ విడుదల చేసిన వీడియో లో రెజ్లర్ల ఆందోళన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని కొందరు అంటున్నారని చెప్పారు. అందులో నిజం లేదని, జనవరిలో జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన కోసం అనుమతులను బీజేపీ నేతలు త్రినాథ్ రానా, బబితా ఫొగట్ తీసుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు తమతో కాంగ్రెసే ఆందోళన చేయిస్తోందని ఎలా చెబుతారని నిలదీశారు. ఇదే విషయం పై ఆదివారం మరోసారి స్పందించిన సాక్షి, బబిత ఫొగట్, త్రినాథ్ రానాలు రెజ్లర్లను స్వార్థపర ప్రయోజనాల కోసం ఎలా వాడుకున్నారన్న విషయాన్ని తెలపడానికి అలా అన్నామని చెప్పారు. కానీ వారికి తాము అంటించిన చురకలను అర్థం చేసుకునే శక్తి లేకుండాపోయిందని ఎద్దేవా చేశారు.

దాంతో సాక్షిపై బబిత మండిపడ్డారు. రెజ్లర్ల ఆందోళనతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే విషయంలో తాను మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నానని తెలిపారు. అంతే కాదు జనవరిలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి కోరుతూ పోలీసులకు రాసిన లేఖపై తన సంతకమే లేదన్నారు. తనకు ప్రధాని మోదీపై, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, నిజాలు బయటకు వస్తాయన్నారు. మోదీని, అమిత్ షాను కలవాలని తాను రెజ్లర్లకు చెబితే, వారు వెళ్లి దీపేందర్ సింగ్ హుడా, ప్రియాంకా గాంధీలాంటి వారిని కలిశారని పేర్కొన్నారు.

మరోవైపు సాక్షి మాలిక్, ఆమె భర్త చెప్పిన విషయాలు అసత్యాలు అన్నారు మైనర్ రెజ్లర్ తండ్రి. తమ ఎవరు బెదిరించలేదని తమకు తెలిసిన నిజాన్ని మాత్రమే బయటకు వెల్లడించామని మైనర్ బాలిక తండ్రి స్పష్టం చేశారు.

బ్రిడ్జ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు గతవారం 1500 పేజీల చార్జ్ షీట్ ను పటియాల హౌస్ కోర్టులో దాఖలు చేశారు. అలాగే అతనిపై పెట్టిన ఫోక్సో కేసును రద్దు చేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story