బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో సంచలన తీర్పు

బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో సంచలన తీర్పు
బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో సంచలన తీర్పు వెలువడింది.. ఈ కేసులో నిందితులు అందరూ నిర్దోషులే అని ప్రత్యేక సిబిఐ కోర్టు తేల్చింది. కూల్చివేతలో ఎలాంటి కుట్రకోణం లేదని..

బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో సంచలన తీర్పు వెలువడింది.. ఈ కేసులో నిందితులు అందరూ నిర్దోషులే అని ప్రత్యేక సిబిఐ కోర్టు తేల్చింది. కూల్చివేతలో ఎలాంటి కుట్రకోణం లేదని.. పధకం ప్రకారమే మసీదును కూల్చివేశారన్న ఆరోపణలకు ఆధారాలు లభించలేదని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పుతో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, ఉమా భారతిలకు ఊరట లభించినట్లయింది. కాగా 1992 డిసెంబర్‌ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేసిన విషయం విదితమే. ఈ కేసును విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story