రండి తినండి ప్రైజ్ మనీ పొందండి

రండి తినండి ప్రైజ్ మనీ పొందండి
12 కేజీల బాహుబలి సమోసా.. అరగంటలో తింటే 71 వేలు

ఎప్పుడు తిండిగోలే తప్పితే సంపాదించేది ఏం లేదా అని ఇంట్లో తిట్లు కాసే వాళ్ళకి ఇదొక శుభవార్త. ఎందుకంటే సుబ్బరంగా తిని ప్రైజ్ కొట్టేసే అవకాశం ఇస్తున్నాడు ఓ వ్యాపారి. తన షాప్ లో చేసిన ఓ సమోసా తింటే ఏకంగా 71 వేల క్యాష్ ప్రైజ్ ప్రకటించాడు.

యూ పీ లోని మేరఠ్ లో ప్రాంతంలోని లాల్ కుర్తీకి చెందిన కౌశల్ స్వీట్స్ యజమాని ఓ భారీ బాహుబలి సమోసాను తయారు చేసాడు. దాని మొత్తం బరువు 12 కేజీలు కాగా దీనిని నూనెలో ఫ్రై చేయడానికి గంటన్నర సమయం పడుతుంది. ఈ సమోసాలో దాదాపు 7 కిలోలల వరకు బంగాళ దుంపలు, బఠానీలు, మసాలా, పనీర్, డ్రై ఫ్రూట్స్ మిశ్రయం ఉంటుందని వివరించాడు. ఇంత పెద్ద సమోసాను తయారు చేయడానికి ముగ్గురు వంటమనుషులకు దాదాపు 6 గంటల సమయం పడుతుందని చెప్పిన యజమాని దీని ధర 1500 రూపాయలు గా నిర్ణయించాడు.

ఈ 12 కిలోల సమోసాను ఎవరన్నా 30 నిమిషాల్లో తింటే రూ.71 వేలు గెలుచుకోవచ్చని ఆఫర్ కూడా పెట్టారు. ఈ భారీ సమోసా చాలేంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షాప్ కి జనాలు విపరీతంగా వెళుతున్నా ఇప్పటి వరకు ఆ బాహుబలి సమోసా ఛాలెంజ్ ను గెలిచిన వారెవ్వరూ లేరు. కానీ ఇప్పటికే ఈ సమోసా కోసం దాదాపు 40 నుంచి 50 ఆర్డర్లు వచ్చాయని కౌశల్ తెలిపాడు.

కౌశల్ తాను తయారు చేసే సమోసాలకు గుర్తింపు వచ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే మొదట 4 కిలోల సమోసా చేసాడు..ఆ ఐడియా హిట్ అవ్వడంతో ఎనిమిది కిలోల సమోసాలు తయారు చేశాడు. దానిని అరగంటలో తింటే బిల్లు కట్టక్కర్లేదని పైగా తానే రూ. 51 వేలు ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు. అయితే ట్రై చేసి మొత్తం తినకపోతే సమోసాకు బిల్లు కట్టాలి. చాలా మంది ట్రై చేశారని కానీ ఎవరూ తినలేకపోయారప్పుడు. తిన్నా తినకపోయినా దీనికి మంచి స్పందన రావడం, ఎక్కువ అమ్మకాలు జరగడంతో ఈసారి 12 కిలోల సమోసాను తయారు చేశాడు. తన దుకాణానికి వచ్చిన కస్టమర్లు వారి పుట్టిన రోజుకు కేక్ కట్ చేయడానికి బదులుగా సమోసా కట్ చేస్తున్నారని ఆనందంగా చెబుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story