Odisha Train Tragedy: బాలాసోర్ రైలు ఘటనలో ఏడుగురు సస్పెన్షన్

Odisha Train Tragedy: బాలాసోర్ రైలు ఘటనలో ఏడుగురు సస్పెన్షన్
సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు

ఒడిశా రైలు ప్రమాదం లో జరుగుతున్న విచారణలో భాగంగా ఈ ఘోరానికి కారణమైన ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దక్షిణ తూర్పు రైల్వే శాఖ. వీరిలో ఇదే కేసులో అంతకు ముందు సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు.

ఈ విషయాన్ని ఆగ్నేయ రైల్వే జీఎం అనిల్ కుమార్ మిశ్రా మీడియా సమావేశం లో ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన అధికారులు ఏమాత్రం జాగ్రత్త వ్యవహరించి అప్రమత్తంగా ఉన్నా ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని, వారి నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయనన్నారు. మొదట సీబీఐ ద్వారా అరెస్టైన ముగ్గురు, 24 గంటల క్రితం అరెస్టైన మరో ఉద్యోగి తోపాటు మరో ముగ్గురుని సస్పెండ్ చేస్తున్నట్లు అనిల్ మిశ్రా తెలిపారు. మొత్తం ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసామన్నారు. ఉద్యోగులు సాక్ష్యాలను ధ్వంసం చేయడం, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు .


బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాదంలో ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ గతంలో అరెస్టు చేసింది. వీరిలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్ మరియు టెక్నీషియన్ పప్పు కుమార్ ఉన్నారు. లెవెల్-క్రాసింగ్ లొకేషన్ బాక్స్‌లోని వైర్లు తప్పుగా అమర్చారని, ఈ విషయాన్ని సంవత్సరాల తరబడి గుర్తించలేదని సీబీఐ తేల్చింది. ఇదే ఆరోజు గందరగోళానికి దారితీసిందని తన నివేదికలో తెలిపింది. ముగ్గురికి మరో నాలుగు రోజుల రిమాండ్ పొడిగించాలని సీబీఐ కోరిన విషయం తెలిసిందే.

జూన్ 2న రాత్రి 7 గంటలకు ఒడిశా బాలాసోర్ జిల్లా బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద కేవలం 15 నిమిషాల వ్యవధిలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 298 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1200 మందికి పైగా గాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story