ఈశాన్య రాష్ట్రాల సీఎంలకు తియ్యని కానుక.. పంపింది ఎవరంటే..

ఈశాన్య రాష్ట్రాల సీఎంలకు తియ్యని కానుక..  పంపింది ఎవరంటే..
600 కేజీల మామిడి పళ్ళు పంపిన బాంగ్లాదేశ్ ప్రధాని

దేశంలోని ఈశాన్య రాష్ట్రాల సీఎంలకు తియ్యని బహుమతులు అందాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రేమగా బాక్స్ లు బాక్స్ లు గా బహుమతులు పంపినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ తీయనైన బహుమతులు ఏంటో తెలుసా.. నోరూరించే మామిడి పళ్ళు అవీ కూడా 600 కేజీల హిమాసాగర్, లంగ్రా రకాలకు చెందిన మామిడి పండ్లను కానుకగా పంపించినట్లు సమాచారం. హసీనా పొరుగు దేశాల అధికారులకు మామిడి పండ్లను బహుకరించడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది కూడా ఆమె భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం ముఖ్యమంత్రులకు, రాష్ట్రపతి ముర్ముకు ఆమె మామిడి పండ్లను బహుమతిగా పంపారు. రాజకీయ పరంగా ఎన్ని ఉన్నా.. వాటన్నింటినీ పక్కన పెట్టి యేటా తమ దేశంలో దొరికే మేలైన మామిడి పండ్ల రకాలనుముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులకు పంపడం ఆనవాయిగా పెట్టుకున్నారు. ఈ విషయంపై గతంలో మాట్లాడిన బంగ్లాదేశ్ ప్రధాని పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఎప్పటికీ బాగుండాలని తాను కోరుకుంటానన్నారు .

Tags

Read MoreRead Less
Next Story