West Bengal: కేరళ దాటిన నీపా వైరస్

West Bengal: కేరళ దాటిన నీపా వైరస్
సొంతూరికి తిరిగొచ్చిన పశ్చిమబెంగాల్ యువకుడిలో నిపా వైరస్ లక్షణాలు

కేరళలో కలకలం రేపిన నిఫా వైరస్ తాజాగా పశ్చిమ బెంగాల్ కు కూడా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఫా వైరస్‌ను పోలిన లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరడమే దీనికి కారణం. పొట్టకూటి కోసం కేరళ వెళ్లి సొంత రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్ కు తిరిగివచ్చిన ఓ యువకుడిలో నిఫా వైరస్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడ్డాయి. కేరళలో వలస కూలీలుగా పనిచేస్తున్న బుర్ద్వాన్ జిల్లాకు చెందిన వ్యక్తి తీవ్ర జ్వరం, వికారం, గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరినట్లుగా బెంగాల్ ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.

ప్రస్తుతం ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లో కలకలం రేపుతోంది. 20 ఏళ్ల వయసున్న ఆ యువకుడికి అవసరమైన పరీక్షలు చేయాల్సి వుందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సదరు వ్యక్తి తొలుత కేరళలోని ఎర్నాకులం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే బెంగాల్‌కు తిరిగి వచ్చాడని.. అయితే రెండ్రోజుల్లోనే మళ్లీ అస్వస్థతకు గురయ్యాడని సదరు అధికారి తెలిపారు. ఆ యువకుడిని తొలుత నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి, ఆపై బెలియాఘట ఐడీ హాస్పిటల్‌కు తరలించారు. దీనితో నిఫా వైరస్ పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించిందా అనే అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి.


యువకుడు తీవ్ర జ్వరం, వికారం, గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరాడు. అయితే ఈ లక్షణాలు నిఫా వైరస్ లక్షణాలుగా కనిపించడం, అదీకాక అతడు కేరళ నుంచి వచ్చాడు అని తెలియడంతో వైద్యులు అతడికి నిఫా వైరస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇంకా అతడికి నిఫా వైరస్ సోకిందా లేదా అన్నది నిర్థారణ కాలేదు.

ఇక కేరళలో నిఫా వైరస్ కారణంగా మరణాలు కూడా సంభవించిన విషయం తెలిసిందే. ఈ విషయం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కేరళలో ఈ కేసులు నమోదు కావడం లేదు. ఇప్పటి వరకు కేరళలో ఆరుగురుకి ఈ వైరస్ సోకింది. వారిలో ఇద్దరు మరణించారు. గతంలో కూడా పలుమార్లు ఇక్కడ నిఫా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 2018 కోజికోడ్ లో, 2019లో ఎర్నాకులంలో 2021లో మళ్లీ కోజికోడ్‌లో ఈ నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story