West Bengal: రసగుల్లా తినిపించి బాలుడి హత్య

West Bengal: రసగుల్లా తినిపించి బాలుడి హత్య
నిందితులు ముగ్గురు 8 వ తరగతి చదువుతున్న బాలురు

ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది మానవతా విలువలు మాసిపోతున్నాయి .చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ వయసువారైనా నదురు బెదురు లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. ఆన్ లైన్ గేమింగ్ కోసం కొంత మంది ప్రాణాలు తీసేకుంటున్నారు ఇంకొందరు ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో తన తోటి స్నేహితుడిని డబ్బల కోసం చంపేశారు 8 వ తరగతి విద్యార్థులు.

పశ్చిమ బెంగాల్ నడియా జిల్లాలో దారుణం జరిగింది. తమ తోటి స్నేహితుడినే డబ్బుల కోసం కిడ్నాప్ ప్లాన్ వేశారు. ఆ డబ్బులతో వాళ్ళు గేమ్‌లు ఆడేందుకు కంప్యూటర్‌ను కొనుగోలు చేద్దాం అని అనుకున్నారు. బాలుడిని కిడ్నప్ చేసి తల్లికి కాల్ చేశారు. భర్తను కోల్పోయి చిన్న ఉద్యోగం తో సోదరుని ఇంట్లో ఉండే ఆమె ఆ డబ్బులు ఇచ్చే ఆలోచన లేక వెంటనే పోలీస్ లకు చెప్పేసింది. బాలుడు శుక్రవారం సైకిల్ తో స్నేహితుల వద్దకు వెళ్లాడని, తరువాత కిడ్నప్ అని ఫోన్ చేసి డబ్బులు అడిగారని చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ..ముగ్గురు విద్యార్థులు తమ స్నేహితుడిని రమ్మని పిలిచారు. దీంతో ఆ బాలుడు శుక్రవారం సైకిల్ తో స్నేహితుల వద్దకు వెళ్లాడు. వారు అతడిని కిడ్నాప్ చేసి ఇంట్లో వారికి కాల్ చేసి మూడు లక్షలు కావాలని డిమాండ్ చేశారు. లేదంటే పిల్లాడిని చంపేస్తామని బెదిరించారు. ఆ వచ్చిన డబ్బుతో ఒక గేమింగ్ ల్యాప్ టాప్ కొనాలని వారు అనుకున్నారు . . అయితే డబ్బులు ఇచ్చేందుకు బాలుడి కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో ఆ ముగ్గురు కలిసి స్నేహితుడని కూడా చూడకుండా చంపేశారు. అయితే చంపేముందు వాడి చివరి కోరికను అడిగి అతడికి రసగుల్లాలు, కూల్ డ్రింక్ కొనిపెట్టారు. చిన్న పిల్లలు ఇంతటి దారుణానికి పాల్పడ్డారని తెలియడంతో స్థానికులు షాక్ అయ్యారు. నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని జువెలిన్ కోర్టుకు హాజరుపరిచారు.


Tags

Read MoreRead Less
Next Story