బెంగళూరులో బార్లు, క్లబ్ లపై దాడులు

బెంగళూరులో బార్లు, క్లబ్ లపై దాడులు
డ్రగ్స్ వాడుతూ అసాంఘిక కార్యకలాపాలు

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 25 మందికి పైగా ఆఫ్రికన్లను కర్ణాటకలోని బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు.ఎంజీ రోడ్డు, బ్రిగేడు రోడ్లలో ఉన్న బార్లు, పబ్బులపై కేంద్ర విభాగ పోలీసులు దాడులు జరిపారు. డ్రగ్స్ తో పాటు అనేక ఇతర అనైతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నగరంలో జరుగుతున్న నేర కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బార్లు, పబ్బుల మీద పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు, సోదాల్లో మహిళలు, పురుషులతో కలిపి 25 మందికి పైగా ఆఫ్రికన్లను, పోలీసులు డ్రగ్స్ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిసింది.అయితే పోలీసుల దాడి సమయంలో ఆ ప్రదేశంలో మంచి హైడ్రామా జరిగింది. పోలీసులను చూడగానే అరెస్టు చేయడానికి వచ్చారని అర్థమైన ఆఫ్రికన్ మహిళలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మరి కొంతమంది యువతులు మద్యంమత్తులో పోలీసులతో గొడవకు దిగారు. రోడ్డు మీదే రచ్చ రచ్చ చేశారు. దీంతో వీరందరిని పోలీసులు బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వారికి వైద్య పరీక్షల నిర్వహించారు. డ్రగ్స్ తీసుకున్నట్లుగా వైద్య పరీక్షల్లో రుజువైన తరువాత వారిని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంబంధితులకు ఫోన్లు చేసి అరెస్ట్ అయిన ఆఫ్రికన్ల పాస్పోర్టు, వీసా తీసుకురావాలని తెలిపారు. అయితే వారి గురించి ఎవరు పోలీస్ స్టేషన్ కి రాకపోవడం, పాస్పోర్ట్లను తీసుకురాకపోవడంతో అరెస్ట్ అయిన వారిపై పై డ్రగ్స్ కేస్ తో పాటు అక్రమ వలస కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే పోలీసులు సోదాల్లో ఎవరి వద్దా వద్ద డ్రగ్ దొరకలేదు.. కానీ నిందితులు డ్రగ్స్ తీసుకున్నారని పరీక్షలలో తేలడంతో అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే అంశం మీద పోలీసుల విచారణ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story