బీహార్ లో పుంజుకుంటున్న మహాఘట్ బందన్!

బీహార్ లో పుంజుకుంటున్న మహాఘట్ బందన్!
బీహార్ లో మళ్లీ లెక్కలు మారుతున్నాయి. ఇప్పటిదాకా వెనుకంజలో ఉన్న మహాఘట్ బందన్ మళ్లీ పుంజుకుంటుంది. కాసేపటి క్రితం వరకు రాష్ట్రంలో కాషాయం..

బీహార్ లో మళ్లీ లెక్కలు మారుతున్నాయి. ఇప్పటిదాకా వెనుకంజలో ఉన్న మహాఘట్ బందన్ మళ్లీ పుంజుకుంటుంది. కాసేపటి క్రితం వరకు రాష్ట్రంలో కాషాయం పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించబోతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు బీజేపీతో సమానంగా ఆర్జేడీ సీట్లు రాబడుతుంది. దీంతో ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అతి పెద్ద పార్టీగా నిలవనుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జేడీయూ మూడో పార్టీగా, కాంగ్రెస్ నాలుగో పార్టీగా నిలవనున్నాయి.

ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. ఆ పార్టీ పోటీ చేసిన 135 స్థానాల్లోనూ వెనుకంజలోనే ఉంది. కనీసం ఒక స్థానం కూడా దక్కించులేకపోయింది. మరోవైపు ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది.

కౌంటింగ్ మొదలైన దగ్గరి నుంచి ఎన్డీఏ, మహాఘట్ బందన్ మధ్య గెలుపు దోబుచులాడుతోంది. ఉదయం కౌంటింగ్ మొదలైనప్పుడు మహాఘట్ బందన్ విజయం దిశగా దూసుకెళ్లింది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి గెలుపు దిశగా వచ్చింది. తాజాగా ఇరు కూటమిల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. దీంతో బీహార్ గడ్డ ఎవరిదో తెలియాలంటే అర్థరాత్రి వరకు ఉత్కంఠగా ఎదురుచూడక తప్పదు.

మొత్తం మూడు దశల్లో జరిగిన పోలింగ్ లో 4 కోట్ల 11లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకు 3కోట్ల ఓట్లు లెక్కించామని ఎన్నికల ప్రధానాధికారి హెచ్.ఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఇంకా కోటి 11లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందన్నారు. తుది ఫలితం వచ్చే సరికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story