బిహార్‌ విద్యాశాఖా మంత్రి రాజీనామా

బిహార్‌ విద్యాశాఖా మంత్రి రాజీనామా

బీహార్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి.. మూడేళ్ల నాటి అవినీతి కేసులో ఆరోపణలు వెల్లువెత్తడంతో విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరి తన పదవి నుంచి తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి అందజేశారు. గతంలో భాగల్పూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్‌ గా పనిచేసిన మేవలాల్ చౌదరి.. ఆ సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ శాస్త్రవేత్తల పోస్టులకు నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో 2017 లో తారాపూర్‌కు చెందిన జెడి (యు) ఎమ్మెల్యేగా గెలిచినా మేవాలాల్‌ చౌదరిపై క్రిమినల్ కేసు నమోదైంది.

అయితే అప్పటి బీహార్ గవర్నర్‌గా ఉన్న అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ అనుమతి ఇచ్చిన తరువాత ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అతనిపై ఇంకా చార్జిషీట్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో మేవాలాల్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం పట్ల ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రిపదవికి రాజీనామా చేశారు మేవాలాల్.. కాగా బుధవారం ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మేవాలాల్‌ చౌదరి జాతీయ గీతం తప్పుగా ఆలపించడంతో నెటిజెన్ల ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story