దూసుకొస్తున్న బిపర్‌జోయ్ తుఫాన్‌... గుజరాత్‌ లో అల్లకల్లోలం

దూసుకొస్తున్న బిపర్‌జోయ్ తుఫాన్‌... గుజరాత్‌ లో అల్లకల్లోలం
తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు

బిపర్‌జోయ్ తుఫాన్‌ తీరం వైపు దూసుకొస్తుంది. తీవ్ర తుఫాన్‌గా మారిన బిపర్‌జోయ్.. బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్‌ కారణంగా గుజరాత్‌ అల్లకల్లోలం అవుతుంది. రేపు సాయంత్రం 4నుంచి 8గంటల మధ్య బిపర్‌జోయ్ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు.

తుఫాన్‌ కారణంగా సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇక మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సైతం రంగంలోకి దిగారు. మరోవైపు తుఫాన్ కారణంగా 69 రైళ్లు రద్దు అయ్యాయి. మరో 58 రైళ్లను పశ్చిమ రైల్వే పాక్షికంగా రద్దు చేసింది .

Tags

Read MoreRead Less
Next Story