నైరుతి రుతుపవనాలపై బిపర్జాయ్ తుఫాన్ ప్రభావం

నైరుతి రుతుపవనాలపై బిపర్జాయ్ తుఫాన్ ప్రభావం

నైరుతి రుతుపవనాలపై బిపర్జాయ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది.. తుఫాన్ ఎఫెక్ట్ తో రుతుపవనాల విస్తరణకు బ్రేక్ పడింది.. తొలకరి కోసం ఎదురు చూస్తున్న రైతన్నల ఆశలపై నీళ్లు జల్లింది.. ఈపాటికే విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, మరో అయిదారు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎండల తీవ్రత కొనసాగుతోంది. వేడి గాలుల ఉధృతి ఎక్కడా తగ్గలేదు. ఇక ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమయంలో పిల్లల విషయంలో, జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మొన్నటినుంచి స్కూళ్లను తెరిచింది. ఒంటిపూట బడులు పెట్టినప్పటికి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో పిల్లలు, పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రత తగ్గిన తరువాత స్కూళ్ళు రి ఓపెన్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం పేరెంట్స్ నుంచి వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story