Encounter: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 29కి పెరిగిన మృతి చెందిన మావోల సంఖ్య

Encounter: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 29కి పెరిగిన మృతి చెందిన మావోల సంఖ్య
మృతుల్లో కీలక నేతలు!

ఛత్తీస్‌గఢ్‌ లోని కంకేర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, నక్సలైట్ల మధ్య చోటుచేసుకున్న ఎదురెదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఒకరితో సహా 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్ట‌ర్, ఇద్ద‌రు జ‌వాన్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. చోటి బిటీయా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని క‌ల్ప‌ర్ అడ‌విలో పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురుకాల్పులు ఇంకా కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం.ఇప్పటివరకు ౧౧ మంది మృతదేహాలను , ఘటనాస్థలంలో ఏకే 47, 7ఎల్ఎంజి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఆపరేషన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డీఆర్‌జీ) పోలీసులు సంయుక్తంగా చేపట్టారు. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఛోటెబతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత శంకర్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన కాంకెర్ జిల్లాలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story