Ayodhya: అయోధ్యాపురికి వెళ్లేందుకు భక్తజనం ఏర్పాట్లు

Ayodhya: అయోధ్యాపురికి వెళ్లేందుకు భక్తజనం ఏర్పాట్లు
అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపను కళ్లారా చూసేందుకు భక్తుల ఏర్పాటు.. ఆరు నెలల ముందే హోటళ్ల బుకింగ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య భవ్య రామమందిర(Ram temple) నిర్మాణం చకచకా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరి 15-24 మధ్య(January 15 and 24) జరిగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన(consecration) ను తిలకించేందుకు భక్తులు సమాయత్తం అవుతున్నారు. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు తహతహలాడుతున్న భక్తులు ఇప్పుడే పెద్దఎత్తున‍ హోటళ్లు, రిసార్ట్‌లు, హోమ్‌స్టేలు బుక్‌ (Booking rush)చేసుకుంటున్నారు.

ఇప్పటికే అయోధ్య( Ayodhya)లోని రామమందిర ప్రాంతం(Shri Ram Janmabhoomi) పర్యాటక శోభ సంతరించుకుంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన(consecration ceremony)కు మరో 6నెలల సమయం ఉండగానే ఆ అపూర్వ ఘటాన్ని కనులారా వీక్షించాలని భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాములోరి విగ్రహ ప్రతిష్టాపనను కళ్లారా చూసేందుకు భక్తులు ఆన్‌లైన్‌, ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా హోటల్లో, రిసార్టులలో గదులు బుక్‌ చేసుకుంటున్నారు.


ఈ మహా ఘట్టాన్ని చూసేందుకు లక్షల్లో ప్రజలు తరలివచ్చే అవకాశాలున్నాయని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా తమను సంప్రదించే వారు 10, 12 రోజులు(10 to 12 days ) ఉండేలా గదులు బుక్‌ చేసుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఇతర మెట్రో నగరాల నుంచి ఎక్కువగా సంప్రదిస్తున్నారని వివరించారు. ముంబయికి చెందిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ వారం పాటు 15వేల గదులు కావాలని అడిగినట్లు ఓ రిసార్ట్‌ ప్రకటించింది.

రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన( historic event )ను దృష్టిలో పెట్టుకుని అక్కడి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. హోటళ్ల యజమానుల(Hoteliers and resort)తో సమావేశం నిర్వహించి భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించేలా సిద్ధమవ్వాలని మార్గదర్శకం చేస్తున్నారు. పేయింగ్ గెస్ట్ పథకం కింద 41 మంది భవన యజమానులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. పర్యాటకులు, భక్తుల బస కోసం హోటల్( hotels), గెస్ట్ హౌస్( guest house), హోమ్‌స్టేలు అవసరమని, ఇవి స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని అధికారులు చెబుతున్నారు. రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవలే.. గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తవగా...... తాజాగా మొదటి అంతస్తు పనులు ప్రారంభించామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story