Navy Chief: బ్రహ్మోస్ క్షిపణే మన ప్రధాన ఆయుధం : హరికుమార్

Navy Chief: బ్రహ్మోస్ క్షిపణే మన ప్రధాన ఆయుధం : హరికుమార్
పాత మిసైల్ స్థానంలో కొత్తవి

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారత నౌకాదళ ప్రాథమిక ఆయుధం అవుతుందని ఇండియన్ నేవీ తెలిపింది. భూతలం నుంచి భూతలానికి ప్రయోగించే ఆయుధాల్లో ఇదే తమ ప్రధాన ఆయుధం అవుతుందని స్పష్టం చేసింది. నౌకాదళం అమ్ములపొదిలోని ఇతర దేశాల నుంచి సమకూర్చుకున్న పాత క్షిపణి వ్యవస్థలన్నిటిని బ్రహ్మోస్ తో భర్తీ చేయనున్నట్లు ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ R హరికుమార్ తెలిపారు. రక్షణ రంగంపై ఏర్పాటు చేసిన కాబినేట్ కమిటీ.. 19వేల కోట్ల విలువైన 200 బ్రహ్మోస్ క్షిపణుల తయారీ ఒప్పందానికి అంగీకరించిన క్రమంలో ఆయన ఈ విధంగా స్పందించారు. దీని సామర్థ్యం, రేంజ్ , కచ్చితత్వం వల్ల భారత వాయుసేనకూ ఇదే ప్రధాన ఆయుధంగా మారుతుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ క్షిపణి వ్యవస్థను ఇన్ స్టాల్ చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. భారత్ లో తయారవడం వల్ల దీనికి మరమ్మతుల సాంకేతికత, విడిభాగాల లభ్యంతో ఏ సమస్యా ఉండదన్నారు.

‘ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్‌ క్షిపణి ఇప్పుడు మాకు ప్రధాన ఆయుధం కాబోతున్నది. వైమానిక దళంలో, యుద్ధ విమానాల్లో కూడా బ్రహ్మోస్‌ క్షిపణే ప్రధాన ఆయుధం కానుంది. ఈ క్షిపణి సామర్థ్యాలు, పరిధిని మెరుగు పర్చారు. కాబట్టి పాతకాలపు క్షిపణి వ్యవస్థ స్థానంలో బ్రహ్మోస్‌ను స్థాపితం చేస్తున్నాం’ అని నేవీ చీఫ్‌ చెప్పారు.‘బ్రహ్మోస్‌ చాలా శక్తిమంతమైన క్షిపణి. దీని పరిధి, సామర్థ్యం దేశీయంగానే మెరుగుచేశారు. నిజం చెప్పాలంటే బ్రహ్మోస్‌ క్షిపణి ఇక దేశంలోనే తయారవుతుంది. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. దేశంలోని ఈ క్షపణి రిపేర్‌ చేయవచ్చు. స్పేర్‌ పార్ట్స్‌ కూడా ఇక్కడే లభ్యమవుతాయి. కాబట్టి ఇది భారత్‌కు చాలా సానుకూలాంశం’ అని ఆయన పేర్కొన్నారు.

త్వరలో 200కు పైగా క్షిపణుల కొనుగోలుకు సంబంధించిన రూ.19 వేల కోట్ల డీల్‌కు భారత క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఇచ్చిన కొన్ని రోజులకే నేవీ చీఫ్‌ హరికుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ డీల్‌పై బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమెటెడ్‌, భారత రక్షణ శాఖ వచ్చే నెల 5న సంతకాలు చేయనున్నాయి. బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అనేది 1998లో ఏర్పాటైన భారత్‌-రష్యా జాయింట్‌ వెంచర్‌.

Tags

Read MoreRead Less
Next Story