Breast Milk Jewellery: తల్లి పాలు, బొడ్డు పేగుతో ఆభరణాలు.. కర్ణాటక మహిళ వినూత్న ప్రయోగం..

Breast Milk Jewellery: తల్లి పాలు, బొడ్డు పేగుతో ఆభరణాలు.. కర్ణాటక మహిళ వినూత్న ప్రయోగం..
Breast Milk Jewellery: నగలు అనేవి అందాన్ని మరింత పెంచేలా ఉంటాయి.

Breast Milk Jewellery: నగలు అనేవి అందాన్ని మరింత పెంచేలా ఉంటాయి. చిన్నదైనా, పెద్దదైనా.. ఓ ఆభరణం ఒంటి మీద ధరిస్తే దానితో వచ్చే లుక్కే వేరు. అయితే కొంతమంది వారి ఆభరణాలు వారే తయారు చేసుకుంటారు. తమకు ఇష్టమైన వారి జ్ఞాపకాలను ఆభరణాలుగా మలుచుకునే వారు కూడా ఉన్నారు. అయితే తల్లి పాలను ఎవరూ మరచిపోకూడదని ఓ మహిళ వాటితో ఆభరణాలు చేయడం మొదలుపెట్టింది.



ఇంకా ఊహ కూడా రాని సమయంలో అందరం తల్లి పాలను రుచి చూసుంటాం. కానీ వాటి కమ్మదనం మాత్రం ఎప్పటికీ అందరి మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. చాలావరకు ఎవరికి నచ్చిన జ్ఞాపకాలతో వారు సొంతంగా ఆభరణాలు తయారు చేసుకుంటున్న ఈ రోజుల్లో తల్లి పాలతో కూడా ఆభరణాలు ఉంటే బాగుంటుందన్న భావన వచ్చింది కర్ణాటకకు చెందిన నమితకు. అంతే.. కొన్ని రోజుల్లోనే ఆ ఆలోచనకు ఓ రూపం వచ్చింది.

ఒక బిడ్డకు జన్మనివ్వగానే ఆ కుటుంబంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. అంతే కాకుండా ఎన్నో కొత్త అనుభవాలు కూడా ఎదురవుతాయి. అయితే ఆ అనుభవాలన్ని జ్ఞాపకాలుగా చెరిగిపోకుండా ఆభరణాలు తయారు చేయాలని నమిత అనుకుంది. తల్లి పాలతో, మొదటిసారి కట్ చేసిన పిల్లల గోళ్లు, జుట్టుతో ఆభరణాలు తయారు చేయడం మొదలుపెట్టింది. నమిత్ బయోటెక్నాలజీలో ఎమ్‌ఎస్‌సీ చేసింది.


'మమ్మాస్ మిల్కీటేల్' అనే సంస్థను స్థాపించి తల్లిపాలతో ఆభరణాలు తయారు చేసి, వాటిని అమ్మడం మొదలుపెట్టింది. కేవలం తల్లి పాలతోనే పిల్లలు పుట్టినప్పుడు కట్ చేసిన వారి బొడ్డు పేగుతో కూడా ఆభరణాలు తయారు చేస్తుంది. అందుకే తన 'మమ్మాస్ మిల్కీటేల్' జెవలరీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ముఖ్యంగా అమెరికాలో తన ఆభరణాలకు చాలా డిమాండ్ ఉంది.

Tags

Read MoreRead Less
Next Story