British Airline : బరువెక్కిన విమానం.. పైలట్ ఏం చేసాడంటే ..

British Airline : బరువెక్కిన విమానం.. పైలట్ ఏం చేసాడంటే ..
టేకాఫ్ కష్టమంటూ 19 మంది ప్రయాణికులను దించేసిన సిబ్బంది

సాధారణంగా విమాన ప్రయాణం చేసేటప్పుడు లగేజ్ ని చాలా కరెక్ట్ గా లెక్క చూసుకుంటాం. ఎక్కువైతే తీసేసి సరిపడా లగేజ్ ను మాత్రమే తీసుకెళ్తాం ఎందుకంటే ఫ్లైట్లో మనకి నచ్చినంత కాదు.. వాళ్ళు చెప్పినంత బరువు మాత్రమే అంగీకరిస్తారు కాబట్టి. కానీ స్పెయిన్ లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.. బరువెక్కువ అయిపోయిందంటూ 19 మంది ప్రయాణికులనే ఏకంగా దించేశారు ఏయిర్ పోర్ట్ లో.. వివరాల్లోకి వెళితే

బ్రిటన్ కు చెందిన బడ్జెట్ విమాన సంస్థ ఈజీ జెట్ స్పెయిన్ నుండి బ్రిటన్ కు వెళ్లాల్సి ఉంది. జులై 5, బుధవారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ విమానం షెడ్యూల్ ప్రకారం టేకాఫ్ కావాలి. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆలస్యమైంది. రన్ వే పొడవు కూడా తక్కువగా ఉంది. టేకాఫ్ కు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు పైలెట్.. ఈ పరిస్థితుల్లో బరువైన ఈ విమానం టేకాఫ్ కష్టమని చెప్పాడు. కొందరు ప్రయాణికులు దిగిపోతే టేకాఫ్ సాధ్యమవుతుందని అనౌన్స్ చేసాడు. జెట్ పైలెట్, సిబ్బంది, ఇరవై మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా దిగిపోతే విమానం టేకాఫ్ అవుతుందని, అలా దిగిన వారు తమ ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలని సూచించారు. అంతేకాదు వారికి సంస్థ 500 పౌండ్ల పారితోషికం ఇస్తుందని కూడా ప్రకటించారు. ఆఫర్ ఇచ్చినా సరే ఎవరూ దిగడానికి ముందుకు రాలేదు. దీంతో చివరకు సిబ్బంది నచ్చజెప్పి 19 మంది ప్రయాణికులను విమానం నుండి కిందకు దింపి, ఆ తర్వాత విమానంలో పంపించారు. వారు దిగిన తర్వాత రెండు గంటల ఆలస్యంగా రాత్రి 11.24 గంటలకు టేకాఫ్ అయింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story