Budget 2024-25: రైల్వే కారిడార్ల అభివృద్ధి, కొత్త విమాన సర్వీసులు

Budget 2024-25: రైల్వే కారిడార్ల అభివృద్ధి, కొత్త విమాన సర్వీసులు
బడ్జెట్‌ లో మౌలిక సదుపాయాల అభివృద్ధికే ప్రాధాన్యం

మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా మూడు ప్రధాన రైల్వే కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. అందుకోసం ఈ ఆర్థిక సంవత్సరం మూలధన వ్యయాన్ని 11.11 లక్షల కోట్లకు పెంచినట్లు తెలిపారు. గత నాలుగేళ్లలో మూలధన వ్యయం పెంపు వల్ల...ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనలో బహుళ ప్రభావం కనిపించదని కేంద్రమంత్రి వెల్లడించారు.

వచ్చే ఐదేళ్లలో ఊహించని రీతిలో అభివృద్ధి జరగనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2024-25 సంవత్సరానికి దేశ మూలధన వ్యయాన్ని 11శాతం పెంచి 11.11లక్షల కోట్లు వ్యయం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇది జీడీపీలో 3.4 శాతమన్నారు. గత నాలుగేళ్లలో మూలధన వ్యయాన్ని మూడింతలు పెంచటం వల్ల...ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనలో బహుళ ప్రభావం చూపినట్లు తెలిపారు. 40 వేల సాధారణ రైల్వే బోగీలను...వందేభారత్‌ ప్రమాణాలతో మార్చనున్నట్లు చెప్పారు. రైల్వే సర్వీసుల రద్దీ, ప్రయాణికుల రద్దీ ఉండే కారిడార్లలో...నూతన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. శక్తి, ఖనిజాలు, సిమెంటు కోసం ఒకటి, రెండోది పోర్టులకు కనెక్టివిటి పెంచే కారిడార్‌, మూడోది రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.


టైర్‌ 2, 3 నగరాలకు కొత్త విమాన సర్వీసులు నడపనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందుకోసం విమానయాన సంస్థలు... వెయ్యికిపైగా విమానాలను ఆర్డర్‌ చేసినట్లు చెప్పారు. విమానాల ఆర్డర్లే...దేశ విమానయాన అభివృద్ధిని చాటుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌-మధ్యప్రాచ్యం-యూరప్‌ కారిడార్‌... వ్యూహాత్మకంగా, ఆర్థికంగా గేమ్‌ ఛేంజర్‌ కానుందని కేంద్రమంత్రి తెలిపారు. పోర్టులకు కనెక్టివిటి పెంచే దిశగా వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. లక్షద్వీప్‌సహా ఇతర దీపాల్లో సదుపాయాలు పెంచనున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఛార్జింగ్‌ పాయింట్లు, ప్రజా రవాణాకు ఈ-బస్సులను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story