పాముల పంతం.. చేపకు పునర్జన్మ..

పాముల పంతం వలన.. ఓ చేపకు పునర్జన్మ లభించింది. దొరికిన చేపను తినకుండా పంతానికి పోయి కడుపుమాడ్చుకున్నాయి పాములు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కన్హా నేషనల్ పార్క్ లో జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్కులో ఉన్న నీటికుంటలో చేపలు ఉన్నాయి. అయితే ఆకలితో ఉన్న రెండు పాములు ఆహరం కోసం వెతుకుతుండగా.. నీటిలో ఒక క్యాట్ ఫిష్ దొరికింది. మొదట ఓ పాము చేప తలను పట్టుకుంది.. అదే సమయంలో మరో పాము చేప తోకను పట్టుకుంది. దాదాపు అరగంట వరకూ అలాగే పట్టుకున్నాయి కానీ ఏ పాము ఆ చేపను వదల్లేదు. ఈ క్రమంలో రెండు పాములు ఒంట్లో ఓపిక కోల్పోయి.. చేపను ఒక్కసారిగా వదిలేశాయి.. దాంతో ఆ పాము బతుకుజీవుడా అంటూ నీటిలోకి తుర్రుమంది. ఈ దృశ్యాన్ని పర్యావరణ ప్రేమికుడు ఘన్‌శ్యామ్ ప్రసాద్ భన్‌వారే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. అది వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com