Arvind Kejriwal: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI

Arvind Kejriwal:  కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
ఇంటి రిపేరుకు రూ.44కోట్లు ఖర్చుపై కేసు!

దిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసం ఆధునీకరణ, టెండర్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ-CBI ప్రాథమిక విచారణ మొదలుపెట్టింది. దిల్లీ ప్రభుత్వానికి చెందిన గుర్తుతెలియని ప్రజా సేవకుడికి వ్యతిరేకంగా విచారణ ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ విచారణలో ఆధారాలు లభిస్తే....రెగ్యులర్ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. సీఎం అధికార నివాసం ఆధునీకరణకు సంబంధించి అనుమతి పత్రాలు ఇవ్వాలంటూ పబ్లిక్ వర్క్స్ విభాగానికి దర్యాప్తు అధికారులు లేఖ రాశారు. భవనం ప్లాన్ , కాంట్రాక్టర్ కు చెల్లింపులు చేసిన దస్త్రాలు ఇవ్వాలని కోరారు. వచ్చే మంగళవారం ఉదయం గంటలకల్లా ఈ దస్త్రాలు సమర్పించాలని సీబీఐ అధికారులు సూచించారు. మరోవైపు సీబీఐ కేసుపై ఆప్ తీవ్రంగా స్పందించింది.


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. దర్యాప్తు సంస్థ బుధవారం కేసు నమోదు చేసింది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నిర్వహించిన విచారణ తర్వాత వెలుగులోకి వచ్చిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ అన్ని కోణాల్లోనూ విచారించనుంది.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ డైరెక్టర్‌కు మే నెలలో రాసిన ఐదు పేజీల లేఖ ఆధారంగా విచారణకు ఆదేశించారు.కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రత్యేక ఆడిట్‌ను కూడా హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసం సుందరీకరణ కోసం దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో వివాదం చెలరేగింది.


ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య మాటాల యుద్దం కొనసాగుతోంది. మా పార్టీని నాశనం చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. ఇప్పుడు వారు కేజ్రీవాల్‌కు పగ్గాలు వేయాలనుకుంటున్నారు, అందుకే వారు అన్ని ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు ఆప్ నేతలు. సీఎం కేజ్రీవాల్ పై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని అప్పుడు ఏమీ దొరకలేదు ఇప్పుడు కూడా ఏమి దొరకదన్నారు. బీజేపీ ఎన్ని విమ ర్శ లు చేసినా.. సామాన్యుల సంక్షేమం కోసం కేజ్రీవాల్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారని తెలిపింది. ఈ క్రమంలో ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఓ వీడియోను పంచుకున్నారు. కేజ్రీవాల్ పాత బంగ్లా పైకప్పు మూడుసార్లు కూలిపోయిందని చెప్పారు. అందువల్ల బంగళా పునర్నిర్మాణం అవసరమని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story