Manipur : ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్..

Manipur : ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్..
మహిళలపై అమానుష వైఖరిని ఉపేక్షించేదన్న సుప్రీం

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో కేంద్ర దర్యాపు సంస్థ విచారణ ప్రారంభించింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ నమోదైన రెండోరోజునే సీబీఐ ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచన మేరకు కేసును సిబిఐ కు అప్పగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై మణిపుర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను, సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

ఈ కేసులో న్యాయవిచారణను మణిపుర్ ఆవలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం గతంలో అభ్యర్థించింది. ఈ విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరింది. మణిపుర్‌లో వెలుగులోకి వచ్చిన ఆ ఘటనను కేంద్రం అత్యంత హేయమైనదిగా పరిగణిస్తుందని, న్యాయం జరిగేలా చూస్తేనే.. మహిళలపై ఇలాంటి నేరాలు తగ్గుతాయని, అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది..

మణిపూర్ అల్లర్లలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన వీడియో అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించి దేశమంతా కుదిపేసింది. ఈ ఘటన- అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి ఉక్కిరిబిక్కిరి కావడంతో ఈ కేసును సీబిఐకి బదలాయించారు. ఈ కేసులో మణిపూర్ పోలీస్ శాఖ ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసి రేప్, మర్డర్ అభియోగాయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story