MSP: పంటల మద్దతు ధరపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 17 పంటలకు ఎంతెంతంటే.?

MSP: పంటల మద్దతు ధరపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 17 పంటలకు ఎంతెంతంటే.?
MSP: దేశవ్యాప్తంగా రైతులు పండించే పంటలకు మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

MSP: దేశవ్యాప్తంగా రైతులు పండించే పంటలకు మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 పంటలకు గానూ మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. ధాన్యంపై క్వింటాలుకు 100 రూపాయలు, జొన్నలపై క్వింటాలుకు 232, సజ్జలపై క్వింటాలుకు 100 , మొక్కజొన్న క్వింటాలుకు 92 రూపాయలు, సోయాబీన్‌ క్వింటాలుకు 300, కందులపై క్వింటాలుకు 300, పెసర్లు క్వింటాలుకు 480 రూపాయలు, మినుములు క్వింటాలుకు 300, వేరుశనగ క్వింటాలుకు 300, నువ్వులపై క్వింటాలుకు 523 రూపాయలు, పొద్దు తిరుగుడు క్వింటాలుకు 385, పత్తి క్వింటాలుకు 354 రూపాయలు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.

దేశంలో వ్యవసాయం రంగం మరింత బలోపేతం అయ్యేందుకు తాజా నిర్ణయాలు ఊతమిస్తాయని.. మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. మద్దతు ధర పెంపుతో రైతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని… రైతులకు వ్యవసాయంపై మరింత ఆసక్తి కలిగి ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరగడం ద్వారా.. ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఊతమిచ్చినట్లు అవుతుందని ఠాకూర్‌ చెప్పారు

Tags

Read MoreRead Less
Next Story