MANIPUR: మణిపుర్‌ కేసు సీబీఐ చేతికి!

MANIPUR: మణిపుర్‌ కేసు సీబీఐ చేతికి!
మణిపుర్‌ అమానవీయ ఘటన కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం!

జాతుల మధ్య వైరంతో దాదాపు మూడు నెలలు(last three months)గా మణిపుర్‌‍( Manipur) రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అల్లర్లు(violence) చెలరేగుతూనే ఉన్నాయి. పరిస్థితి అదుపులోకి వస్తుందనే భద్రతా దళాలు భావించేలోగానే మరో ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం(Centre) కీలక నిర్ణయం తీసుకుంది.

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి( women being paraded naked by a mob) అనంతరం అత్యాచారం చేసిన కేసు( Manipur Horror Video)ను కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Bureau of Investigation)కు అప్పగించాలని కేంద్రహోంశాఖ నిర్ణయించింది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన కేసులో ఏడుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీడియో తీసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేయడంతోపాటు ఆ మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


కేసు విచారణను కూడా మణిపుర్‌లో కాకుండా బయట చేపట్టాలని( Trials Outside State) కూడా కేంద్ర ప్రభుత్వం(Central Government ) ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అస్సాంలోని కోర్టులో ఈ కేసు విచారణ చేపట్టాలని కోరనున్నట్లు తెలిపాయి. మరోవైపు ఈ ఘర్షణలకు కారణమైన మైతేయ్‌, కుకీ వర్గాలతోనూ కేంద్ర హోంశాఖ సంప్రదింపులు జరుపుతోందని.. మణిపుర్‌ రాష్ట్రంలో త్వరలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చే ఈ చర్చల ప్రక్రియ తుదిదశలో ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మణిపుర్‌లో దాదాపు మూడు నెలలుగా జరుగుతోన్న ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మైతేయ్‌, కుకీ వర్గాల ప్రజలతోపాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘర్షణలు మొదలైన మే మొదటి వారం నుంచి ఇప్పటివరకు సుమారు వేల సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలుస్తోంది.


మణిపుర్‌లో మైతేయ్‌, కుకీ వర్గానికి చెందిన నిరసనకారులు భారీ స్థాయిలో ఆయుధాలను దోచుకున్నారు. వాటి సంఖ్య 4,537 వరకు ఉంటుందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. వాటిలో 1,600 ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మణిపుర్‌లో 37 ప్రాంతాల్లో ఈ దోపిడీకి పాల్పడ్డారు. మే నెలలో హింస ప్రారంభమైన దగ్గరి నుంచి 10వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అలాగే 181 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 60 మంది మైతేయ్‌లు ఉండగా.. 113 మంది కుకీలు ఉన్నారు. ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. మొత్తంగా 21 మంది మహిళలు ఈ ఘర్షణలకు బలయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story