మారటోరియం పీరియడ్‌లో రుణాలపై వడ్డీ మాఫీ!

మారటోరియం పీరియడ్‌లో రుణాలపై వడ్డీ మాఫీ!

లాక్‌డౌన్‌ సందర్భంగా రుణాలకు సంబంధించి ఆరు నెలలపాటు విధించిన మారటోరియంపై... కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆరు నెలల మారటోరియం పీరియడ్‌లో రుణాలపై వడ్డీ మాఫీ విషయంలో తన నిర్ణయాన్ని కేంద్రం ఆఫిడవిట్‌లో వివరించింది. మారటోరియం సమయంలో కొన్ని రకాల రుణాల వడ్డీపై వడ్డీని వదులుకునేందుకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. ఆరు నెలల మారటోరియం కాలంలో 2 కోట్ల వరకు గల రుణాలపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమైనట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

MSMEలు, గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలపై, వినియోగదారు వస్తువుల EMIలపై వడ్డీలను మినహాయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ ద్వారా సుప్రీం కోర్టు వివరించింది. సమస్యకు వడ్డీ భారాన్ని పెంచడమే ఏకైక పరిష్కారమని నిర్ణయించినట్టు అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే అన్ని రకాల రుణాలకు వడ్డీని చెల్లించాలంటే 6 లక్షల కోట్లు భారం పడుతుందని... అది చాలా అధికమని... అందుకే 2 కోట్ల లోపు రుణాలకే వడ్డీ చెల్లించాలని నిర్ణయించినట్టు కేంద్రం చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story