Odisha: నదిలో దొరికిన రథ చక్రం

Odisha: నదిలో దొరికిన రథ చక్రం
మహాభారత కాలం నాటి ‘రథ చక్రం’ అంటూ స్థానికుల పూజలు

ఒడిశాలోని ఖండ్మల్ జిల్లా పురణ్‌షాహీ గ్రామంలోని ఖడగ్ నదిలో ఓ రథ చక్రం లభించడం స్థానికంగా సంచలనానికి దారి తీసింది. ఒనదిలో స్నానం చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన ఓ రాతి వస్తువు ఇప్పుడు ఆ రాష్ట్రం లో దైవంగా మారింది. ఇటీవల జరిగిన ఆ ఘటన లో దొరికిన చక్రాన్ని పోలిన గుండ్రటి ఆకారపు రాతి ముక్క స్థానికుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. కంధమాల్‌లోని కె నుగావ్‌ బ్లాక్‌ పరిధిలోని పురునాసాహి గ్రామ సమీపంలోని ఖడాగ్‌ నదిలో స్నానం చేస్తున్న పురుణసాహి గ్రామ నివాసి అయిన సుమంత నాయక్‌ కు ఈ సంఘటన ఎదురైంది. అది అర్జునుడి రథ చక్రమని నమ్ముతున్న స్థానికులు తండోపతండాలుగా తరలివచ్చి చక్రానికి పూజ చేసి వెళుతున్నారు.

నదిలో స్నానానికి వెళ్లిన స్థానికుడు సుమంతా నాయక్‌కు ఈ చక్రం కనిపించింది. అర్జునుడి రథ చక్రం అక్కడ ఉన్నట్టు నాలుగు రోజుల క్రితమే తనకు కల వచ్చిందని అతడు చెప్పడం సంచలనానికి దారితీసింది. ‘‘అర్జున్‌ఘాట్ వద్ద నాకీ చక్రం దొరికింది. మహాభారత కాలంలో అర్జునుడు అధిరోహించిన రథ చక్రం ఇదేనని మేం బలంగా నమ్ముతున్నాం’’ అని అతడు చెప్పుకొచ్చాడు. పూరీనసాహి గ్రామస్తులు దీనిని ఎంత బలంగా నమ్ముతున్నారంటే, ఇది మహాభారత కాలంలో స్వయంగా శ్రీకృష్ణుడు నడిపిన అర్జునుడి రథం అని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుండ్రంగా ఉన్న రాతి చక్రం మధ్యలో ఒక రంధ్రం ఉండటంతో ఇది చక్రం ఆకారంలో కనిపిస్తోంది. ఇక్కడ మరో కొస మెరుపు ఏంటంటే.. చక్రం దొరికిన ప్రదేశాన్ని చాలా కాలంగా అర్జునఘాట్ అని పిలిచేవారట కానీ ఎందుకు అలా పిలుస్తారో ఎవరికీ తెలియదంటున్నారు స్థానికులు. దీంతో ఆ పురుణసాహి గ్రామమొక్కటే కాదు చుట్టు పక్కల గ్రామాలకు ఈ వార్త విస్తరించడం తో తండోపతండాలుగా జనం తరలి వచ్చి పూజలు చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story