Bhupesh Baghel: పార్టీ కీలక సమావేశంలో గేమ్‌ ఆడిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం

Bhupesh Baghel: పార్టీ కీలక సమావేశంలో గేమ్‌ ఆడిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం
బీజేపీ తీవ్ర విమర్శలు.. ఘాటుగా బదులిచ్చిన భూపేశ్ బఘేల్

క్యాండీక్రష్ గేమ్ అంటే చాలామందికి ఇష్టం ఉండచ్చు కానీ ఒక్కోసారి అది ఆడుకొనే టైం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది . సీరియస్ మీటింగ్‌లో ఓ ముఖ్యమంత్రి క్యాండీక్రష్ గేమ్ ఆటడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన మరెవరో కాదు ఛత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంగళవారం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరైన బఘేట్ తీరిగ్గా ఆయన మొబైల్ తీసి క్యాండీ క్రష్ గేమ్ ఆడాడు. దీనికి సంబంధించిన ఫోటో బయటకు రావడంతో బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని అధికార కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతున్నది. 15 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగిన బీజేపీ పాలనకు ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రజలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టంగట్టారు. అయితే, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయకపోవడం, రాష్ట్రంలో అభివృద్ధి పడకేయడం వెరసి హస్తం పార్టీపై ప్రస్తుతం ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతర్గత కుమ్ములాటలు పార్టీని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను నిర్ణయించడమే లక్ష్యంగా రాయ్‌పూర్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం భూపేశ్‌ బఘేల్‌ తన ఫోన్‌లో ‘క్యాండీక్రష్‌’ గేమ్‌ ఆడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఎంత ప్రయత్నించినా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదని తెలిసీ సీఎం భూపేష్ బఘేట్ రిలాక్స్ అవుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే బదులు క్యాండీక్రష్ ఆడుకోవడమే మేలని భావించి ఉంటారని చురకలంటించింది.


అయితే బీజేపీ విమర్శలకు బఘేల్ స్పందించారు. తాను బైక్ నడిపినా, సంప్రదాయ ఛత్తీస్గడ్ ఆటలు ఆడితే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఇప్పుడు సమావేశానికి ముందు క్యాండీక్రష్ ఆడితే ఆ ఫోటోలను షేర్ చేసి విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. అధికారంలో ఎవరుండాలి అని నిర్ణయించేది రాష్ట్ర ప్రజలే అని, నేను సంప్రదాయ ఆటలు ఆడుతా, క్యాండీక్రష్ నా ఫేవరెట్ గేమ్, ఇప్పటి వరకు అన్ని లెవల్స్ దాటేశాను, ఇక ముందు కూడా దీన్ని కొనసాగిస్తా.. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం ఛత్తీస్గడ్ మొత్తానికి తెలుసన్నారు.

Tags

Read MoreRead Less
Next Story