Viral : నర బలి కోరిన మేక

Viral : నర బలి కోరిన మేక
కత్తితో బలిచ్చినందుకు కంటితో చంపిన మేక

బలిచ్చిన జంతువే అతనిని బలి తీసుకుంది. ఏ చేతులతో ఒక జీవి ప్రాణం తీసాడో. అదే చేతులతో అదే జంతువు వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడు. కత్తితో తనను బలి ఇచ్చినందుకు కంటితో చంపేసింది ఓ మేక. ఆశ్చర్యం కలిగించే ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ఖోపా ధామ్‌ అనే క్షేత్రం లో జరిగింది.

సాధారణంగా దేవుడికి బలి ఇవ్వాలి అంటే మేకనో, గొర్రెనో, కోడినో ఏదో ఒక సాధు జంతువుని బలిస్తాం. కత్తితో ఒక్కవేటులో నరికేసి తరువాత దాన్నే వండుకొని ఆరాగిస్తాం. అలానే చేసాడు ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాకు చెందిన బగర్ సాయి.. కానీ ఆ పని చేసిన కాసేపటికే అదే మేక అతనిని బలి తీసుకుంది.





చత్తీస్గడ్ సూరజ్ పూర్ జిల్లాలోని ఖోపాధామ్ అనే క్షేత్రం లో దేవుడికి తన మొక్కులు చెల్లించుకొనే కార్యక్రంలో భాగంగా మేకలను కోస్తారు. అలానే మొక్కు తీర్చుకోవడం కోసం ఆ క్షేత్రానికి వచ్చిన బగర్ సాయి కోరిన కోర్కెను తీర్చినందుకు గానూ ఒక మేకను బలి ఇచ్చాడు. తరువాత ఆనవాయితీ ప్రకారం అదే మేక మాంసాన్ని వంటకాలు చేసి స్నేహితులు, బంధువులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు. తింటూ తింటూ మేక కన్నును నోట్లో వేసుకున్నాడు.. అంతే అది కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది.





శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులకు తెలిసి ఆస్పత్రికి వచ్చేసరికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆ ప్రాంతంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సాధారణం గా మేక కళ్ళు తినొచ్చని అవి చాలా మామూలుగా, సున్నితంగా నమిలి మింగేయడానికి అనువుగా టమాటాలా ఉంటుంది అని చెబుతున్నారు స్థానికులు. ఇలా జరగడం దేవుడి ఆగ్రహంగా పేర్కొంటున్నారు. బగర్ ఇచ్చిన మేక బలి ఆమోదం పొందలేదని అందుకే ఇలాంటి ఘటన జరిగిందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story