Live in relationship: మైనర్‌తో సహజీవనం.. కోర్టు కీలక తీర్పు

Live in relationship: మైనర్‌తో సహజీవనం.. కోర్టు కీలక తీర్పు
సహజీవనంపై కీలక తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు.. ఇంతకీ ఏం చెప్పిందంటే..

18ఏళ్లలోపువారు( under the age of 18) సహజీవనం(Live in relationship‌) చేయడం చట్టవిరుద్ధం, అనైతికమని( Not Only Immoral But Also Illegal) అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court ) స్పష్టం చేసింది. 18ఏళ్లలోపు ఉన్న అబ్బాయి వయస్సులో తనకంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర విచారణ నుంచి రక్షణ పొందలేడని, వారి చర్యలు చట్టపరమైనవి కావని జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ రాజేంద్రకుమార్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొన్నిరోజులక్రితం ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 19ఏళ్ల అమ్మాయి(19-year-old Hindu girl), 17ఏళ్ల అబ్బాయి( 17-year-old Muslim boy) ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రయాగ్ రాజ్ లో సహజీవనం చేస్తున్నారు.


తమ అమ్మాయి కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు( girl’s family) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు అమెను బలవంతంగా తమ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న అమ్మాయి జరిగిన ఘటన మొత్తాన్ని అబ్బాయి తండ్రికి తెలియజేసింది. అబ్బాయి తరపున అతని తండ్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అబ్బాయిపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని అమ్మాయి మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు 18ఏళ్లలోపువారు సహజీవనం చేయడం అనైతికమని వ్యాఖ్యానించింది. ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా జీవించేందుకు హక్కు ఉన్నప్పటికీ వారు మేజర్లు అయి ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

భాగస్వాముల్లో ఏ ఒక్కరు మైనర్ అయినా ఆ సంబంధం చెల్లదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. సాధారణంగా సహజీవనానికి ఏ కోర్టు చట్టబద్ధత ఇవ్వదని, ఇలా మైనారిటీ తీరకుండానే సహజీవనంలో ఉంటే , అది అనైతిక చర్య మాత్రమే కాకుండా చట్టవిరుద్ధం అవుతుందని, ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఈ కేసులో మైనర్ ముస్లిం వర్గానికి చెందిన వాడని, అతడి మతానికి చెందిన ఆచారాల ప్రకారం కూడా సహ జీవనం చెల్లదని స్పష్టం చేసింది.

మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా సహజీవనం చేసేందుకు హక్కు ఉంటుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిపై ఆరోపించిన నేరానికి ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేదు. దీంతో నేరం జరిగిందనే అభిప్రాయానికి రాలేమని కోర్టు పేర్కొంది. ఈ సంఘటనపై మరింత విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story