కరోనా సీజన్ లో బాల్య వివాహాలు..

కరోనా సీజన్ లో బాల్య వివాహాలు..
ఓ పక్క ప్రపంచమంతా కొవిడ్ తో పోరాడుతోంటే.. మరోపక్క కొందరి ఇళ్లలో పెళ్లి బాజాలు మోగాయి. కరోనా సీజన్ పుణ్యమా అని పెళ్లి

ఓ పక్క ప్రపంచమంతా కొవిడ్ తో పోరాడుతోంటే.. మరోపక్క కొందరి ఇళ్లలో పెళ్లి బాజాలు మోగాయి. కరోనా సీజన్ పుణ్యమా అని పెళ్లి కాని ప్రసాదులందరూ ఓ ఇంటి వారయ్యారు. సరే ఓ వయసు వచ్చిన వారు పెళ్లిళ్లు చేసుకుంటే అర్థముంది. అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులకు పెళ్లిళ్లు చేసారు కర్ణాటక వాసులు. కర్ణాటక రాష్ట్ర పిల్లల హక్కుల రక్షణ కమిషన్ (కెఎస్‌సిపిసిఆర్) ప్రకారం, గత నాలుగు నెలల్లో (ఏప్రిల్-జూలై) రాష్ట్రంలో 107 బాల్య వివాహ కేసులు నమోదయ్యాయి, గత ఏడాది మొత్తం 156 కేసులు నమోదయ్యాయి.

"తల్లిదండ్రులు వారి పిల్లలకు వివాహం చేయడానికి ఇదే మంచి సమయం అని భావించారు. లాక్డౌన్ కారణంగా అధికారుల దృష్టిలో పడనివ్వకుండా ఈ వివాహాలు గప్ చిప్ గా జరిపించశారు. కొన్ని కేసులు నోడల్ ఏజెన్సీ జోక్యంతో 550 కి పైగా బాల్యవివాహాలు రద్దైనట్లు డాక్టర్ ఆంథోనీ తెలిపారు. కెఎస్‌సిపిసిఆర్ గణాంకాల ప్రకారం బాలరి, మైసూరు, బాగల్‌కోట్, ధార్వాడ్, బెలగావి, మరియు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుండి బాల్యవివాహాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఇదిలావుండగా, మహిళలకు '181' హెల్ప్‌లైన్ నంబర్ గురించి అవగాహన ఉన్నందున ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత చాలా మంది అధికారులు అందుబాటులో లేనప్పటికీ, మేము వివాహాలను ఆపగలిగాము, కేసులను బుక్ చేసాము అని కర్ణాటకలోని మహిళా, శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ కె.ఎ.దయానంద్ అన్నారు.

మహమ్మారి సమయంలో తల్లిదండ్రులు తమ కుమార్తెల వివాహాలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఖర్చు తగ్గించడం అని డాక్టర్ ఆంథోనీ అన్నారు. "సాధారణంగా వివాహాలు నిర్వహించడం అనేది ఓ పెద్ద వ్యవహారం.. అందుకోసం భారీగా అప్పులు చేయాల్సి ఉంటుంది. లాక్డౌన్, మహమ్మారి వివాహ వేడుక నిర్వహణా ఖర్చులను పరిమితం చేశాయి. ఇది తల్లిదండ్రులు డబ్బు ఆదా చేసుకునేందుకు ఓ అవకాశంగా అని పించిందని డాక్టర్ ఆంథోనీ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story