Congress: మెజార్టీ సీట్లు గెలవాలి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

Congress: మెజార్టీ సీట్లు గెలవాలి..  కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
ఢిల్లీ ఏఐసీసీ ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ దిల్లీ వేదికగా వ్యూహమథనం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై.. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు స్థానాల సమన్వయకర్తలతో నిర్వహించిన సమావేశానికి.. భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నంసహా ఇతర నేతలు హాజరయ్యారు.

వచ్చే ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేలా ఏఐసీసీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పాగా వేసిన తరహాలోనే పార్లమెంటరీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని సమాలోచలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై..దిల్లీలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు స్థానాల సమన్వయకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రులు భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్కసహా ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన పలు విషయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రచారం ఎలా ఉండాలి, పోల్ మేనేజ్మెంట్, ప్రజలతో మమేకం అవ్వడంపై ఖర్గే మార్గానిర్ధేశం చేశారన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 కి 17 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. రెండు, మూడు స్థానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని చెప్పారు. 17 కి 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే ఆరు గ్యారెంటీలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. ఖర్గే, రాహుల్‌ దిశానిర్దేశం చేశారని సమావేశం తర్వాత... భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో పోటీ చేయాలని సోనియాగాంధీని సమావేశంలో కోరామని వివరించారు. రాష్ట్రంలో 13 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని మంత్రులు ఉత్తమ్‌, పొన్నంప్రభాకర్‌ ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని అమాత్యులు పేర్కొన్నారు. దేశానికి కాంగ్రెస్‌ నాయకత్వం అవసరమని మంత్రులు సీతక్క, కొండా సురేఖ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలోపు ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామన్న అమాత్యులు.. మెరుగైన ఫలితాలు సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ సమన్వయకర్తలుగా వ్యవహరించే నాయకులు గెలుపు బాధ్యతలు తీసుకోవాలని ఏఐసీసీ పెద్దలు దిశానిర్దేశం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story