Digvijaya Singh: మతం పేరుతో ఓట్లు అడగడం చట్టరీత్యా నేరం

Digvijaya Singh: మతం పేరుతో ఓట్లు అడగడం చట్టరీత్యా నేరం
బజరంగ్ దళ్‌లో కూడా మంచివారు ఉంటారు కాబట్టి నిషేధించబోమమంటూ వ్యాఖ్య

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అక్కడ రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ మాటలకు పదును పెట్టారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడంతో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడ రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ మాటలకు పదును పెట్టారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు ఓటర్లను ఆకర్షించడం కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో ఓట్లు అడగడం చట్టరీత్యా నేరమంటూ ఆయన కుండబద్దలు కొట్టారు.హిందువుల ఓట్లను పొందడం కోసం కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలేమైనా రచిస్తోందా? అని మీడియా సంధించిన ప్రశ్నకు దిగ్విజయ్ సమాధానిస్తూ రాజకీయాల్లో మతానికి స్థానం ఉండకూడదని అన్నారు. హిందుత్వానికి మతంతో సంబంధమే లేదని.. కాబట్టి సాఫ్ట్, హార్డ్ హిందుత్వం అంటూ ఉండదని తేల్చి చెప్పారు. ప్రతి వ్యక్తికి తన మతాన్ని అనుసరించే హక్కు ఉందని, మతం పేరుతో ఓట్లు అడగకూడదని స్పష్టం చేశారు. హిందుత్వ అనే పదాన్ని బీజేపీ సిద్ధాంతకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు వీడీ సావర్కర్ సృష్టించారని అన్నారు. హిందూత్వానికి, హిందు, సనాతన ధర్మానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఈ దేశం ప్రతి ఒక్కరికి చెందిందని తెలిపారు. దే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్ఆర్ఆర్‌కు చెందిన భజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తుందా? అనే ప్రశ్నకు దిగ్విజయ్ బదులిస్తూ.. ఏ సంస్థనైనా నిషేధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే.. భజరంగ్ దళ్‌ని నిషేధించాల్సిన అవసరం లేదని, అందులోని మంచి వ్యక్తులను తాము గౌరవిస్తామని అన్నారు. కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి.. విధ్వంసం, హింసకు పాల్పడే వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2018లో కంటే తమ సన్నద్ధత 1.5 రెట్లు మెరుగైందని.. 230 అసెంబ్లీ సీట్లలో తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. తమకు మంచి ఫలితాలు వస్తాయని తాము ఆశిస్తున్నామని.. ఎందుకంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున ప్రజలు బీజేపీ పట్ల నిరాశ చెందారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉందన్నది వాస్తవమేనని.. కానీ 2018 కంటే తమ పార్టీ ఇప్పుడు బలంగా ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story