విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి కేసులో నో బెయిల్

విద్యార్థినిపై  టీచర్ లైంగిక దాడి కేసులో నో బెయిల్
సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఢిల్లీ హైకోర్టు

తన విద్యార్థినిని లైంగికంగా వేధించి జైలు పాలైన ఒక స్కూల్ టీచర్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. విచారణలో రుజువైతే మైనర్ పై చేసిన అత్యాచారం చిన్న విషయం కాదని, నిందితుడు సాక్షులను ప్రభావితం చేయటం వంటివి చేసే అవకాశం ఉందని భావిస్తూ బెయిల్ అభ్యర్ధనను తోసిపుచ్చింది.

విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ దారుణానికి ఒడిగట్టాడు. నోట్స్ లు ఇస్తానంటూ బాలికను స్కూల్ తరువాత కలిసిన అతను మరిన్ని పుస్తకాలకోసం ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. తినడానికి స్నాక్స్, మంచినీళ్లు ఇచ్చాడు. తర్వాత మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు. అదే వీడియోను వైరల్ చేస్తానంటూ పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆమెను ఒకసారి హోటల్ కి తీసుకొని వెళ్లి మరీ అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల తర్వాత బాధితులను పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక హోటల్ లో పాటు పలు ప్రాంతాల్లో కలిపి ఇప్పటికీ తనను పది మార్లకు పైగా అత్యాచారం చేశారని, మొదటిసారి అత్యాచారం చేసిన సమయానికి తను మైనర్ నని పేర్కొంది. మైనారిటీ తీరిన తర్వాత కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు నిందితుడిపై 376(2) అత్యాచార కేసుతో పాటు పోక్సో కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు మొగ్గు చూపలేదు. ఇటువంటి కేసులో బెయిల్ ఇవ్వడం పోక్సో చట్టం యొక్క ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది న్యాయమూర్తి అన్నారు. డిఎన్ఏ పరీక్షలలోను, హోటల్ కి వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ లు కూడా బాధితురాలికి అనుకూలంగా ఉన్నాయని ఆమె లాయర్ తెలియచేసారు. అయితే ఇది ఇద్దరి అనుమతి తోనే జరిగిందని నిందితుడి లాయర్ చెప్పడానికి ప్రయత్నించారు. దానిని బాలికల తరపు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. మైనర్ పై లైంగిక దాడిని ఎట్టి పరిస్థితులను తప్పించుకోలేరన్నారు. అంతేకాదు నిందితుడి వయసు బాలిక వయసు కంటే రెండు రెట్లు ఎక్కువ ఉంటుందని, నిందితుని కుమార్తె బాధిత బాలిక కంటే చిన్నదని వాదించారు. ఇరు వైపులా ఆరోపణలను విన్న న్యాయమూర్తి టీచరుగా విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకోవాల్సిన వ్యక్తి తన బాధ్యతను పూర్తిగా మరచి అసంబద్ధంగా ప్రవర్తించాడన్నారు. ఇలాంటి కేసులలో బెయిల్ అడగటమే సరికాదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story