Delhi Police: ఉన్నతవిద్యావంతులే... కానీ ఏం లాభం..

Delhi Police: ఉన్నతవిద్యావంతులే... కానీ ఏం లాభం..
పట్టుబడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు ఇంజినీర్లు.. ఒకరు పీహెచ్‌డీ..

దేశంలో పలు ప్రాంతాలలో ఐఎస్ ఉగ్రవాదుల కదలికలను గుర్తించి ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృత సోదాలు నిర్వహించి.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల్లో కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, యూపీలలో సోమవారం అదుపులోకి తీసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నారు. ఇందుకోసం షానవాజ్, రిజ్వాన్ అష్రాఫ్, మొహమ్మద్ అర్షద్ వార్సి తదితరులు దేశంలోని వివిధ ప్రాంతాలలో రెక్కీ కూడా నిర్వహించారు. అయితే వీళ్ళు చదువు సంధ్య లేనివాళ్ళు కాదు. బాగా తెలివైన వాళ్ళు కానీ వాళ్ళు ఆ తెలివిని వినాశనానికి వాడుతున్నారు. ఈ పట్టుబడ్డ వారిలో ముగ్గురు ఇంజనీర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరంతా బాంబుల తయారీలో నిపుణులని నిర్థారణ అయ్యిందని చెప్పారు. ఉన్నత విద్యావంతులైన వీరిలో ఒకరు పీహెచ్‌డీ.. మరొకరేమో మైనింగ్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు.


పట్టుబడిన వారిలో ఝార్ఖండ్ కు చెందిన షానవాజ్ మైనింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ బ్లాస్ట్ లపై తనకున్న పరిజ్ఞానాన్ని ఉగ్ర పేలుళ్లకు ఉపయోగిస్తున్నాడు. మైనింగ్‌ బ్లాస్ట్‌లపై తనకున్న పరిజ్ఞానాన్ని ఉగ్ర పేలుళ్లకు ఉపయోగిస్తున్నాడు. సాధారణ రసాయనాలతో మహ్మద్ షానవాజ్ ఆలం సాధారణ రసాయనాలను ఉపయోగించి క్లీన్, రిఫైన్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ ని తయారు చేయగల ప్రత్యేక సామర్థ్యం కలవాడు.

అర్షద్ వార్సి ప్రొఫైల్‌ కూడా పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఝార్ఖండ్‌కు చెందిన వార్సి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్.. తర్వాత ఎంబీఏ( మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్) పూర్తి చేశాడు. అతడు ప్రస్తుతం జామియా మిలియా ఇస్లామియాలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. స్థానిక ఇన్‌స్టిట్యూట్‌లో ఫిజిక్స్ టీచర్‌గా కూడా పనిచేస్తున్నాడు.

నవంబర్ 2016లో ఢిల్లీకి వచ్చిన షానవాజ్ ఆలం.. ఆగ్నేయ ఢిల్లీలోని అబుల్ ఫజల్ ఎన్‌క్లేవ్‌లో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. షాహీన్ బాగ్ వద్ద మతపరమైన ఉపన్యాసాలు వినే ఆలం.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ భావజాలంతో ప్రభావితమయ్యాడు. అదే ఏడాది మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. టెలిగ్రామ్, ఇతర ఛానెల్‌లలో ఇద్దరూ ISIS అనుకూల సంస్థలను అనుసరించడం ప్రారంభించారు. ముస్లిం యూనివర్శిటీలో బీటెక్ చదివిన వార్సీ అలీఘర్ ఉన్నత విద్య ఢిల్లీకి వచ్చి జామియా నగర్‌లో కొన్ని మతపరమైన కార్యక్రమాలకు హాజరైన సమయంలో ఆలంతో పరిచయం ఏర్పడింది. షానవాజ్ స్థావరంలో జిహాద్‌కు సంబంధించిన పుస్తకాలు, రసాయనాలు లభ్యమయ్యాయి.

వీరంతా పశ్చిమ కనుమల్లోని రహస్య స్థావరాల కోసం రలావాసా, మహాబలేశ్వర్, గోవా, హుబ్లీ, కర్ణాటకలోని సరస్వతి వన్యప్రాణుల ప్రాంతం, ఉడిపి, కేరళ, వల్సాద్ వన్యప్రాణుల అభయారణ్యం, నల్లమల పర్వత శ్రేణులు, చందౌలీని సందర్శించినట్టు పోలీసులు పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story