Puri Jagannath temple : పూరి జగన్నాథ్ దేవాలయంలో డ్రెస్ కోడ్

Puri Jagannath temple : పూరి జగన్నాథ్ దేవాలయంలో డ్రెస్ కోడ్
జీన్స్‌, షార్టులు, స్కర్టులు, స్లీవ్‌లెస్‌ డ్రెస్లపై నిషేధాస్త్రం

పూరీ జగన్నాథ ఆలయంలో డ్రెస్ కోడ్ సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ఒడిశాలోని పూరీ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయంలోకి హాఫ్ ప్యాంట్, షార్ట్, రిప్డ్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించిన వ్యక్తులకు ప్రవేశం లేదని ఆలయ అధికారులు గతంలోనే తెలిపారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి మర్యాదకరమైన దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు కోరారు. కొత్త డ్రెస్ కోడ్ నియమం అమల్లోకి వచ్చిన తర్వాత ఆలయ పరిసరాల్లో ఎక్కువ మంది పురుషులు ధోతీలతో, మహిళా భక్తులు చీరలు, సల్వార్‌ కమీజ్‌లతో కనిపించారు.

ఈ నూతన నిబంధనలు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఆలయ పరిసరాల్లో ఎక్కువ మంది పురుషులు ధోతీలతో, మహిళా భక్తులు చీరలు, సల్వార్‌ కమీజ్‌లతో కనిపించారు. డ్రస్ కోడ్‌పై భక్తులకు అవగాహన కల్పించాలని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం హోటళ్ల యజమానులను కోరింది. పూరి ఆలయం లోపల గుట్కా, పాన్ నమలడంపై నిఘా పెంచారు. అంతేకాకుండా ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని కూడా నిషేధించారు. నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీని ఎదుర్కొనేందుకు తెల్లవారుజామున 1.40 గంటలకే ఆలయ తలుపులు భక్తుల కోసం తెరిచారు. సాయంత్రం 5 గంటల వరకు 3.5 లక్షల మంది ఆలయాన్ని సందర్శించారని ఆలయ కమిటీ తెలిపింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల తోబుట్టువుల నిలయమైన ఈ ఆలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. నిర్మాణంలో తాగునీరు, పబ్లిక్ టాయిలెట్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఆలయంలో సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి.

గతేడాదితో పోల్చితే ఈసారి కొత్త సంవత్సరం రోజున ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పోలీసులు తెలిపారు. పూరి పట్టణంలో ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా విధించారు. బడాదండలోని మార్కెట్ చక్కా నుంచి సింగద్వార మధ్య ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. దిగబరేణి నుండి లైట్‌హౌస్ వరకు బీచ్‌సైడ్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయం లోపల పాన్, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని కూడా నిషేధించారు.

ఆలయ విశిష్టతను కాపాడటానికి ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు అధికారులు చెప్పారు. ఆలయ పరిసరాల్లో గుట్కా, పాన్‌ మసాలాలు, ప్లాస్టిక్‌ సంచులను నిషేధించినట్టు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story