Uttar Pradesh : సాయం కోరి వచ్చిన వ్యక్తికి శిక్ష ..ప్రభుత్వ అధికారి సస్పెన్షన్

Uttar Pradesh : సాయం కోరి వచ్చిన వ్యక్తికి శిక్ష ..ప్రభుత్వ అధికారి సస్పెన్షన్
ఉత్తర్‌ప్రదేశ్‌ బరేలీ జిల్లాలో మదన్‌పూర్ లో ఇటీవల వెలుగు చూసిన ఘటన

సాయం కోరి వచ్చిన ఓ వ్యక్తికి అకారణంగా తన కార్యాలయంలో శిక్ష విధించాడు ఓ అధికారి. నానా మాటలన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ అధికారిని విధుల నుంచి తొలగించారు.

ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని మీర్‌గంజ్ పట్టణానికి చెందిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఉదిత్ పవార్ సాయం కోసం వచ్చిన వ్యక్తికి పనిష్మెంట్ ఇచ్చారన్న ఆరోపణలపై అతనిని విధుల నుంచి తొలగించారు. బరేలీ జిల్లా‌లోని మదన్‌గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ గ్రామంలోని శ్మశానవాటికను ఇతరులు ఆక్రమించారని ఎస్‌డీఎమ్‌కు ఫిర్యాదు చేశారు. మరోచోట స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు.


మందన్ పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆ ఊరి గ్రామస్తులతో కలిసి తమ గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించడానికి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫీస్ కు చేరుకున్నాడు. తమ గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారి అయిన ఎస్డీఎమ్ ఉదిత్ పవార్ కు వినతి పత్రాన్ని అందించాడు. వినతి పత్రాన్ని తీసుకున్న ఉదిత్ పవార్ విసిరి పారేసాడని, తన ముందు మోకరిల్లాలని అన్నట్లు బాధిత యువకుడు తెలిపాడు. దీంతో చేసేదేం లేక అధికారి ముందు వంగి మోకరిల్లాలని ఆ యువకుడు ఆరోపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లా మెజిస్ట్రేట్ రంగంలోకి దిగి ఉదిత్ పవార్‌ను విధుల నుంచి తప్పించి జిల్లా యంత్రాంగానికి అటాచ్ చేశారు.

కాగా ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను ఎస్డీఎమ్ ఉదిత్ పవార్ తోసి పుచ్చారు. తను ఆఫీస్ కు వచ్చేసరికి తన చాంబర్ లో వంగి ఉన్నాడని, ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే సాయం చేయమని వేడుకుంటున్నట్లు బాధిత యువకుడు చెప్పినట్లు ఉదిత్ పవార్ వెల్లడించాడు. ఇక ఈ వ్యవహారంపై ఆరా తీసిన బరేలీ జిల్లా మెజీస్ట్రేట్ శివకాంత్ ద్వివేది, ఘటనకు సంబంధించిన వీడియోను తాను చూశానని, యువకుడిని అవమానించడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపాడు. అతడిని డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేసినట్లు బరేలీ డీఎమ్ వెల్లడించాడు. ఈ ఘటనతో ప్రభుత్వ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story