Ayodhya: దివ్య అయోధ్య యాప్‌తో సహా మరిన్ని హంగులు

Ayodhya:  దివ్య అయోధ్య యాప్‌తో సహా  మరిన్ని హంగులు
విద్యుత్‌ బస్సులు, ఆటోలు కూడా

శతాబ్దాల తరువాత అయోధ్యలో శ్రీరాముడు కొలువు దీరనున్నాడు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రతిష్ఠించనున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం భక్తులు రామయ్యను దర్శించుకునేందుకు రానున్నారు. అయితే అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా సరికొత్త యాప్ ను లాంచ్ చేశారు. అయోధ్య వివరాలు సమగ్రంగా తెలిపే దివ్య అయోధ్య అనే యాప్‌ను యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ సోమవారం విడుదల చేశారు.

జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం 2.00 గంటలకు ముగుస్తుందని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. అయోధ్య రాముడ్ని దర్శించునేందుకు వచ్చే భక్తులు దివ్య అయోధ్య యాప్ ద్వారా అయోధ్యలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆలయాల గురించి తెలుసుకోవచ్చు. అయోధ్యకు వెళ్లే ముందు భక్తులు అయోధ్యలో హోమ్ స్టే, ఎల్ట్రిక్ కార్లు, బస్సులను, టూరిస్ట్ గైడ్, వీల్ ఛైర్, ఇతర వాహనాలను యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో తెచ్చింది యూపీ ప్రభుత్వం. ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఐఫోన్ యూజర్లు దివ్య్ అయోధ్య యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.


ఈ యాప్‌ ద్వారా నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. హోమ్‌స్టే (పర్యాటకులకు ఇంట్లో ఒక గదిని అద్దెకు ఇవ్వడం), హోటళ్లు, గుడారాలు, వీల్‌ఛైర్‌ అసిస్టెంట్‌, గోల్ఫ్‌కార్ట్‌ వాహనాలు, ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులను, టూరిస్ట్‌ గైడ్‌లను ముందస్తు బుకింగ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వ్యక్తిగత వివరాలను నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి. యాప్‌లో నావిగేషన్ సౌకర్యం కల్పించారు. తప్పక చూడాల్సిన ప్రదేశాలు, టూర్‌ ప్యాకేజ్‌, స్థానిక వంటలు, వెహికల్ పార్కింగ్ లకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

మరోవైపు అయోధ్యలో రవాణా ఆధారిత కాలుష్యాన్ని కట్టటి చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పర్యావరణ హితమైన విద్యుత్‌ బస్సులు, ఆటోలను ప్రారంభించింది. అయోధ్యలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 25 విద్యుత్‌ ఆటోలు, 50 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం వచ్చే భక్తులకు ఇవి సేవలు అందించనున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఆటో తయారీ కంపెనీ ETO సహకారంతో ఎలక్ట్రిక్ ఆటోలను ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 25 ఆటోలలో 12 ఆటోలను మహిళా డ్రైవర్లు నడపనున్నారు. విద్యుత్‌ బస్సుల కోసం అయోధ్యలో 22 బస్‌ షెల్టర్లను నిర్మించామని అయోధ్య మున్సిపల్‌ కమిషనర్ విశాల్‌ సింగ్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story