DMK MP Dayanidhi Maran : ఆన్ లైన్ మోసం.. రూ.1లక్ష కోల్పోయిన డీఎంకే ఎంపీ

DMK MP Dayanidhi Maran : ఆన్ లైన్ మోసం.. రూ.1లక్ష కోల్పోయిన డీఎంకే ఎంపీ
ఆన్ లైన్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన డీఎంకే ఎంపీ

మాజీ కేంద్ర మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆన్‌లైన్ మోసగాళ్ల చేతిలో చిక్కుకుని రూ. 99వేల 999 పోగొట్టుకున్నారు. అయితే అతను వారితో ఎలాంటి వివరాలను పంచుకోలేదని పోలీసులు తెలిపారు. మంత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్టోబరు 8న తనకు ‘తెలియని నంబర్‌’ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందని, ఆ తర్వాత అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.99వేల 999 డెబిట్ అయ్యాయి.

కాలర్‌తో దయానిధి ఎలాంటి సమాచారం పంచుకోనప్పటికీ, కొద్దిసేపటికే అనధికార లావాదేవీ జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. లోక్‌సభ ఎంపీ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) అక్టోబర్ 9న కేసు నమోదు చేసింది. "మోసగాళ్లను కనుగొనేందుకు దర్యాప్తు చేస్తున్నాం. కోల్పోయిన మొత్తాన్ని త్వరగా తిరిగి పొందడం కోసం చెల్లింపు గేట్‌వేకి అభ్యర్థన పంపబడింది" అని సిటీ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

"ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల గురించి తెలుసుకోవాలని" పోలీసులు ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు. సైబర్ సంబంధిత మోసాల గురించి సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930ని సంప్రదించాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ – www.cybercerime.gov.inలో తమ ఫిర్యాదును నమోదు చేయాలని వారికి సూచిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story