Fake note: నకిలీ నోటు తో నవ్వుతూ పోస్ట్ పెట్టిన డాక్టర్

Fake note: నకిలీ నోటు తో నవ్వుతూ పోస్ట్ పెట్టిన డాక్టర్
స్కూల్ ప్రాజెక్ట్ నోటుని డాక్టర్ కి ఇచ్చిన పేషెంట్

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ లు అందుబాటులోకి వచ్చాక చాలావరకు క్యాష్ క్యారీ చెయ్యడమే మరచిపోయాము.మరీ అత్యవసరంగా నోట్లు కావాల్సి వచ్చినపుడు జేబులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే కాష్ పేమెంట్స్ చేసే వారు తగ్గడంతో నోట్లను పరిశీలించి చూసే వారి సంఖ్య తగ్గుతోంది. దీంతో ఓ రోగి ఏకంగా వైద్యుడినే బోల్తా కొట్టించాడు. నకిలీ నోటు ఇచ్చి ఎంచక్కా వైద్యం చేయించుకుని వెళ్లిపోయాడు.

తరువాత ఎప్పటికో గానీ అది నకిలీ నోటు అని ఆ డాక్టర్ గుర్తించలేకపోయారు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఫొటోతో సహా సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. అయితే, అది నకిలీ నోటు అని ఆ పేషెంట్ కు కూడా తెలిసి ఉండదని, వేరెవరో ఇచ్చిన నోటును తనకు ఇచ్చి ఉంటాడని డాక్టర్ మానవ్ అరోరా తన పోస్టులో చెప్పుకొచ్చారు. విషయమేంటంటే ఆ నోటు మీద ఫర్ ప్రాజెట్స్ స్కూల్ యూస్ ఓన్లీ అని కూడా రాసి ఉంది.





డాక్టర్ మానవ్ అరోరా ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన కన్సల్టేషన్ ఫీజు 500 రూపాయలు. ఇటీవల ఆయన దగ్గరికి వచ్చిన ఓ రోగి కన్సల్టేషన్ ఫీజు కింద రూ.500 నోటు ఇచ్చాడు. అందరూ ఇచ్చేట్టుగానే ఇచ్చాడు కదా అని తీసుకున్న రిసెప్షనిస్ట్ నోటును పరిశీలించకుండానే లోపల పెట్టేసింది. ఆ రోగి డాక్టర్ ను కలిసి, మందులు రాయించుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం డబ్బుల లెక్కలు చూస్తుండగా నకిలీ 500 నోటును గుర్తించారు అయితే తాను మోసపోయినట్లు గుర్తించి బాగా నవ్వుకున్నట్లు డాక్టర్ మానవ్ చెప్పారు. ఆ నకిలీ నోటును తాను భద్రంగా దాచుకుంటానన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డాక్టర్ మానవ్ అరోరా స్పోర్టివ్ స్పిరిట్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మార్కెట్లో చలామణీ అవుతున్న నకిలీ నోట్లలో రూ.500 నకిలీ నోట్లే ఎక్కువగా ఉన్నాయని ఆర్‌బీఐ ఒక నివేదిక లో తెలిపింది. ఒరిజినల్ రూ.500 నోట్లను గుర్తించేందుకు 17 గుర్తులను సూచించింది. వాటిని గమనిస్తే ఒరిజినల్ నోటును గుర్తించొచ్చు. కానీ తీసుకొనే ప్రతీ నోటును చెక్ చెయ్యడం అనేది అంత సులువు కాదు. అయినా సరే ఫేక్ నోట్ బారిన పడకుండా ఉండాలంటే తప్పదు మరి.

Tags

Read MoreRead Less
Next Story