Earthquake: జమ్మూకాశ్మీర్‌లో మూడోసారి భూకంపం

Earthquake:  జమ్మూకాశ్మీర్‌లో మూడోసారి భూకంపం
భూమి లోపల ఏం జరుగుతోందో

వరుసగా మూడోసారి జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సిఎస్‌) తెలిపింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వివరాల మేరకు … ఈ భూకంపం తెల్లవారుజామున 2 గంటల 47 నిముషాలకు వచ్చింది. 3.5 శాతం తీవ్రతగా రిక్టార్‌ స్కేలుపై నమోదైంది. శనివారం కూడా జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలో 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. వరుసగా గత మూడు రోజుల నుంచి ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి అని ఎన్సీఎస్‌ తెలిపింది. అంతకు ముందు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భూకంపం రాగా, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.2గా నమోదయ్యింది. ఇక, శనివారం మధ్యాహ్నం వచ్చిన భూకంపంలో రిక్టర్‌ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైంది. అయితే ఈ భూకంపం తీవ్రత స్వల్ప వ్యవధిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

ప్రపంచంలోని అనేక దేశాల్లో భూకంప ప్రకంపనలు ఒకదాని తర్వాత ఒకటిగా సంభవించాయి. భూ ప్రకంపనలతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. గత గురు, శుక్రవారాల్లో భారత్‌లో పలుచోట్ల భూకంపం సంభవించింది. శుక్రవారం ఏప్రిల్ 5వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. రాత్రి 11 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం. అర్థరాత్రి సంభవించిన భూకంపంతో కిష్త్వార్‌లో కలకలం రేగింది. రాత్రికి రాత్రే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

దీంతో పాటు రాజస్థాన్‌లో కూడా భూకంపం సంభవించింది. ఇక్కడ పాలిలో మధ్యాహ్నం 1.29 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.7గా నమోదు అయిందని తెలిపారు. అర్థరాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ కూడా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అంతేకాదు గురువారం రాత్రి హిమాచల్‌లో కూడా భూకంపం సంభవించింది. న్యూయార్క్ నగరం , ఉత్తర న్యూజెర్సీ చుట్టూ భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story