Election Commission: మన దేశం లో ఓటర్లు అక్షరాలా 97 కోట్లు

Election Commission: మన దేశం లో ఓటర్లు అక్షరాలా 97 కోట్లు
కొత్తగా 2.65 మంది యువ ఓటర్లు నమోదు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటు వేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం-E.C తెలిపింది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2024-S.S.Rలో భాగంగా ఓటరు జాబితాను E.C విడుదల చేసింది. 2019తో పోలిస్తే...ప్రస్తుతం ఓట్ల సంఖ్య ఆరు శాతం పెరిగిన ట్లు తెలిపింది. కొత్తగా నమోదు చేసుకున్న వారిలో మహిళలు, యువత అధిక సంఖ్యలో ఉన్నట్లు వివరించింది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో...పురుషుల కన్నా మహిళలే ఎక్కువ గా ఉన్నట్లు చెప్పింది. 18 నుంచి 29 ఏళ్ల వయ స్సు ఉన్న రెండు కోట్ల మంది యువత కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారు...ఇంకా తమ ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు E.C వెల్లడించింది.


ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏదంటే సాధారణంగా అందరూ చైనాయేనని చెబుతారు. కానీ.. ఇండియా చైనాను ఎప్పడో దాటేసింది. ఇప్పుడు మన దేశం మరో రికార్డును కూడా దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా నిలిచింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం దాదాపు 97 కోట్ల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. 142 కోట్ల 86 లక్షల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన ఇండియా ఇప్పుడు మరో రికార్డుకెక్కింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 96 కోట్ల 88 లక్షల మంది ఓటు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం రిజిస్టర్ అయిన ఓట్ల సంఖ్య 6% పెరిగిన‌ట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్ తెలిపారు. కొత్తగా ఓట్లు రిజిస్టర్ చేసుకున్న వారిలో మహిళలు, యువతే అధిక సంఖ్యలో ఉన్నారు.ఓటర్లు జాబితా సవరణలో పారదర్శకతతో పాటు స్వచ్ఛత, నిబద్ధతపై కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారుప్రతి దశలో రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో పాటు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన వివిధ పనులను వివరించారు.

దాదాపు 88.35 లక్షల మంది దివ్యాంగ ఓటర్లకు మద్దతు ఇచ్చే ప్రయత్నం జరిగిందని ఈసీ నొక్కి చెప్పింది. ఇది పోలింగ్ రోజున వారు ఓటుహక్కును వినియోగించుకునేలా నిర్ధారిస్తుంది. 2019లో దివ్యాంగ ఓటర్ల సంఖ్య 45.64 లక్షలు. ఇంటింటి సమగ్ర ధ్రువీకరణ తర్వాత 1.65 కోట్ల మందికి పైగా మరణించిన, శాశ్వతంగా బదిలీ అయినవారు, నకిలీ ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.

Tags

Read MoreRead Less
Next Story