DK Shiva kumar: డీకే శివకుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..

DK Shiva kumar:  డీకే శివకుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..
ఓటుకు నీళ్లు ఆఫర్..

తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డీకే శివకుమార్‌ తన సోదరుడు సురేశ్ తరఫున ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఓ హౌసింగ్‌ సొసైటీలో మాట్లాడుతూ..తన సోదరున్ని గెలిపిస్తే మూడు నెలల్లో కావేరీ నది నుంచి తాగునీటిని తీసుకొచ్చి నగర ప్రజల దాహార్తి తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తన సోదరుడి కోసం ఓట్లు దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. డీకే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ధ్రువీకరించింది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.

దేశంలో నాలుగు రాష్ట్రాలు, లోక్ సభస్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే,సాధారణంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేస్తుంది. ఎన్నికల సంఘం నియామవళిని అనుసరించి అందరు వ్యవహారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో దేశంలో ఎన్నిలక సంఘం మాత్రమే క్రియాశీలంగా పనిచేస్తుంది. రాజకీయ నాయకులు ఓటర్లకు ప్రలోభపెట్డడం, బహుమతులు ఇవ్వడంవంటివి ఎన్నికల నియామవళికి పూర్తిగా విరుధ్దం. కొంత మంది నాయకులు తరచుగా ఎన్నికల నియామవళిని ఉల్లంఘించి మాట్లాడుతుంటారు. వీరిపై ఎన్నికల సంఘం తగిన విధంగా చర్యలు కూడా తీసుకుంటుంది.

బెంగళూరుకు రోజూ 2,600-2,800 మిలియన్ లీటర్ల నీరు అవసరమని తెలుస్తోంది. ప్రస్తుత సరఫరా అవుతోంది మాత్రం దానిలో సగం. ఫలితంగా నగరవాసులకు రోజు నరకం అనుభవిస్తున్నారు. ఏప్రిల్ 26, మే 7న రెండు దశల్లో కర్ణాటక లోక్‌సభ ఎన్నికలు జరుగనుండగా, జూన్ 4న అన్ని స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story