Pulwama Encounter : లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

Pulwama Encounter : లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
జైషే మహ్మద్ తో సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్ చివరి అంకానికి వచ్చింది. ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు జైషే మహ్మద్ కమాండర్ కావడంతో ఈ ఎన్‌కౌంటర్ భద్రతా బలగాలకు పెద్ద విజయంగా చెప్పవచ్చు. ఆదివారం రాత్రి నుంచి నిరంతర ఎన్‌కౌంటర్ తర్వాత, భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులను హతమార్చాయి. హతమైన ఉగ్రవాదులను రియాజ్ దార్, ఖలీద్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు. వీరి నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక పత్రాలు కూడా లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. రాత్రంతా ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఎన్‌కౌంటర్‌ను ప్రారంభించే ముందు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేసి, ఇతర వ్యక్తులను ఇళ్లలోనే ఉండమని కోరాయి. తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైన రెండు వారాల తర్వాత ఈ ఎదురుకాల్పులు జరిగాయి.


రెండు వారాల క్రిత్రం జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించారు. స్థానిక హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి అయితే భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ ముగ్గురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీరులోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో భద్రతా బలగాలు గాలింపును విస్తృతం చేశాయి. దీంతో కశ్మీరులో తరచూ ఎదురుకాల్పుల ఘటనలు జరుగుతున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జమ్మూ కశ్మీర్‌లో 2019 ఫిబ్రవరి 14న పాక్ ముష్కరులు ఘాతుకానికి తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులుకాగా.. పలువురు గాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story