Sushil Kumar Shinde: రిటైర్మెంట్‌ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత

Sushil Kumar Shinde: రిటైర్మెంట్‌ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
వారసురాలిగా కుమార్తె ప్రణీతి షిండే

కేంద్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఓ కార్యక్రమంలో మంగళవారం వెల్లడించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన వారసురాలిగా తన కుమార్తె ప్రణీతి షిండే సోలాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 82 ఏళ్ల సుశీల్ కుమార్ షిండే రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. కాగా షిండే రాజకీయ వారసురాలిగా ఇప్పటికే ఆయన కూతురు ప్రణితి షిండే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు . రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన బదులు తన కూతురు ప్రణితి తన నియోజకవర్గమైన షోలాపూర్ నుంచి పోటీ చేస్తారని షిండే వెల్లడించారు. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన షిండే రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించారు. క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటాను. రెండేళ్ళ క్రితమే ఈ నిర్ణయం జరిగిపోయింది అన్నారు.


ఈ క్రమంలో తన కుమార్తె ప్రణితి షిండే తన స్థానంలో షోలాపూర్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాగా 42 ఏళ్ల ప్రణితి షిండే ఇప్పటికే షోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. అయితే చివర్లో ఎవరు పోటీ చేయాలనేది ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.

70వ దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి వచ్చిన షెండే మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. షిండే 2003 జనవరి నుంచి 2004 నవంబరు వరకు కొద్దికాలం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1971లో షిండే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1974, 1980, 1985, 1990, 1992లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆగష్టు 2004-(జనరల్) ఉప ఎన్నికలు, సెప్టెంబర్ 2004 నుండి అక్టోబర్ 2004 వరకు-(జనరల్). 1992 జూలై నుంచి 1998 మార్చి వరకు మహారాష్ట్ర నుంచి షిండే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ప్రచార మేనేజర్ గా వ్యవహరించారు. జనవరి 2003 నుంచి నవంబర్ 2004 మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. యూపీఏ రెండో సారి అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో ఆయనకు చోటు దక్కింది. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. 26/11 ముంబై దాడుల తర్వాత హోం మంత్రిగా పని చేసిన పి చిదంబరం ఆర్థిక మంత్రిత్వ శాఖకు మారారు. దీంతో ఆ పదవిని షిండే చేపట్టారు. 2012లో కేంద్ర హోంమంత్రిగా విధులు నిర్వర్తించారు. సుశీల్ కుమార్ షిండే 2014 వరకు ఈ పదవిలో కొనసాగారు.

Tags

Read MoreRead Less
Next Story