India: కార్గిల్‌ ల్లో రాత్రివేళ ల్యాండింగ్‌

India:  కార్గిల్‌ ల్లో రాత్రివేళ ల్యాండింగ్‌
మరో మైలురాయి సాధించిన ఐఏఎఫ్‌..

పాకిస్తాన్‌తో సరిహద్దు వద్ద అత్యంత కఠినమైన కార్గిల్‌ పర్వతాల్లో ఎయిర్‌స్ట్రిప్‌పై తొలిసారి సి-130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రివేళ ల్యాండింగ్‌ చేసి భారత వాయుసేన మరో ఘనత సాధించింది. గరుడ కమాండోలకు శిక్షణలో భాగంగా ఈ విన్యాసాన్ని వాయుసేన నిర్వహించింది. చైనా సరిహద్దుల్లో కూడా సైనిక అవసరాల కోసం ఎత్తైన ప్రాంతాల్లో అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్లను భారత్‌ సిద్ధం చేసింది.

భారత వాయుసేన మరో ఘనత సాధించింది. అత్యంత కఠినమైన కార్గిల్‌ పర్వతాల్లోని ఎయిర్‌స్ట్రిప్‌పై తొలిసారి సి-130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రివేళ ల్యాండింగ్‌ చేసింది. పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద వాయుసేన ఈ విన్యాసాన్ని నిర్వహించింది. ఈ సైనిక విమానానికి నాలుగు టర్బోప్రాప్‌ ఇంజిన్లు ఉంటాయి. గరుడ్‌ కమాండోల శిక్షణలో భాగంగా ఈ విన్యాసం వాయుసేన నిర్వహించింది. టెర్రైన్‌ మాస్కింగ్‌ను కూడా ఉపయోగించినట్లు వెల్లడించింది. గరుడా కమాండోలను రవాణా విమానం ద్వారా కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌లో రాత్రివేళ వ్యూహాత్మకంగా దింపడం భారత వాయుసేన ఆపరేషనల్‌ సామర్థ్యాలను తెలియజేస్తుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. రవాణా విమానం రాత్రివేళ కఠినమైన ప్రదేశంలో ల్యాండింగ్‌ చేయడం ఇదేతొలిసారి. గరుడా కమాండోలకు ఇది శిక్షణ కింద ఉపయోగపడింది.


సి-130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం దిగిన కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌ సముద్ర మట్టానికి 10 వేల 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి కూడా అన్ని ఎయిర్‌ఫీల్డ్‌లలో మౌలిక సదుపాయాలను భారత్‌ పెంచింది. ఆపరేషనల్‌ అవసరాల కోసం అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్లను సిద్ధం చేసింది. వాస్తవాధీన రేఖకు దగ్గరగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్‌ఫీల్డ్‌గా దౌలత్‌ బేగ్‌ ఓల్డీ వద్ద ఎయిర్‌ఫీల్డ్‌ ప్రసిద్ధి చెందింది. ఇది 13 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌ 40 డిగ్రీల వరకు పడిపోతాయి.

వాయుసేనకు సి-130జే అత్యంత నమ్మకమైన విమానం. ఇటీవల ఉత్తరాఖండ్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే కార్యక్రమంలో ఇది చురుకైన పాత్ర పోషించింది. ఆ సమయంలో వాయుసేన రెండు సి-130జే విమానాలను విజయవంతంగా ఉత్తరాఖండ్‌ ఎయిర్‌ స్ట్రిప్‌పై ల్యాండింగ్‌ చేసింది. నాడు కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఇవి భారీ ఇంజినీరింగ్‌ పరికరాలను అక్కడికి తరలించాయి.

వాయుసేన మొత్తం 12 సి-130జే విమానాలను వాడుతోంది. ఇవి హిండన్‌లోని 77 స్క్వాడ్రన్‌, 87 స్క్వాడ్రన్‌లో విధులు నిర్వహిస్తున్నాయి. బలగాలు, సామగ్రి తరలింపులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద మోహరింపుల్లో ఇవే కీలకం

Tags

Read MoreRead Less
Next Story