రెండో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

రెండో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కరోనాతో దెబ్బతిన్న దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఎంతోమందికి ప్రయోజనం..

కరోనాతో దెబ్బతిన్న దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఎంతోమందికి ప్రయోజనం కలిగించిందన్నారు. కొవిడ్‌ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ప్రభావం చూపడంతో ఆర్థికవ్యవస్థ రికవరీ కనిపిస్తోందన్నారు నిర్మలా సీతారామన్‌ . అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఒక లక్షా 5 వేల కోట్లకు చేరాయన్నారు. బ్యాంక్‌ క్రెడిట్‌ ఫ్లో నెమ్మదించినా వార్షికంగా 5.1 శాతం పెరిగిందన్నారు. వృద్ధిరేటు 9.6 శాతం నెగిటివ్‌ ఉంచి 8.9 నెగిటివ్‌కు మెరుగయ్యే అవకాశం ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story