వరుసభూకంపాలతో వణికిపోతున్న జమ్ము కాశ్మీర్

వరుసభూకంపాలతో వణికిపోతున్న జమ్ము కాశ్మీర్
24 గంటల్లో ఐదుసార్లు పంపించిన భూమి

వరుస భూకంపాలు జమ్మూకశ్మీరును వణికిస్తున్నాయి. 24 గంటల్లోనే ఐదు సార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు . భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో శనివారం రాత్రి 9.55 గంటలకు భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైంది.జమ్మూకశ్మీరు జాతీయ రహదారి వెంబడి కొండ రాంబన్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పలు సార్లు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.

సరిగ్గా అదే సమయానికి జమ్మూ-శ్రీనగర్ భూకంపం సంభవించిందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఈ భూకంపం ఐదు కిలోమీటర్ల లోతులో వచ్చింది. ఇక లేహ్ లడఖ్ ప్రాంతానికి 271 కిలోమీటర్ల దూరంలో శనివారం రాత్రి 9.44 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో శనివారం రాత్రి 9.55 గంటలకు భూకంపం వచ్చింది. గత ఐదు రోజులుగా దోడా జిల్లాలో భూకంపం సంభవించిడం ఇది ఏడో సారి. దోడా జిల్లాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ చేసింది. ఈ భూకంపం 18 కిలోమీటర్ల లోతులో వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దోడా జిల్లాలో మొదటిసారి మంగళవారం 5.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి, తరువాత రోజు మరో రెండు భూకంపాలు రాగా ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు గాయాల పాలయ్యారు.

దీంతో ముందు జాగ్రత్త చర్యగా అక్కడి పాఠశాలాలను సైతం ముసివేశారు.ఆదివారం తెల్లవారుజామున లడఖ్‌లోని లేహ్ జిల్లాకు ఈశాన్యంగా 295 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశం-చైనా సరిహద్దు సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. జమ్మూకశ్మీరులోని కత్రాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఆదివారం తెల్లవారుజామున 3.50 గంటలకు ఐదవ సారి భూకంపం వచ్చింది. కత్రా ప్రాంత భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. ఈ భూకంపం 11కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ వరుస భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు కానీ కొన్ని భవనాలకు పగుళ్లు వచ్చాయి. రోడ్లు చీలిపోయి గుంతలు పడ్డాయి. మరోవైపు వరుస భూకంపాలు ఎందుకు వస్తున్నాయనే విషయంపై భూగర్భ శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story